Thursday, May 9, 2024
- Advertisement -

పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌లిగిస్తాడా…?

- Advertisement -

రెండురోజుల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌ల‌పెట్టిన పాద‌యాత్ర మొద‌లు కానుంది. పాదాయాత్ర‌ద్వారా ప్ర‌జ‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా క‌ల‌వ‌బోతున్నారు. ఆరు నెల‌ల పాటు 3000 కి.మీ పాద‌యాత్ర చేయ‌నున్నారు. అయితె గ‌తంలో కంటె జ‌గ‌న్‌లో చాలామార్పులు క‌న‌ప‌డుతున్నాయి. జాత‌కాలు, ముహూర్తాలు అంటె న‌మ్మ‌ని జ‌గ‌న్ ఇప్పుడు స్వామీజీల‌ను క‌ల‌సి వారి ఆశీర్వాదాలు తీసుకోవ‌డం తెలిసిందే. ఇప్పుడు పాద‌యాత్ర చేయ‌డానికి ముందు తిరుమ‌ల వేంకేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకోవ‌డం ఇవ‌న్నీ చూస్తె జ‌గ‌న్ కూడా త‌న పంథాను మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది.

గ‌తంలో వైఎస్ మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌ను ఓదార్చ‌డానికి యాత్ర చేసిన‌ప్పుడు ప్ర‌ధానంగా జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఓదార్పుయాత్ర కాదు మంది మార్భ‌లంతో పెద్ద కాన్వాయ్‌తో పెళ్లికి వెల్తున్న‌ట్లుగా ఉంద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీనిపై జాతీయ స్థాయిలో కూడా పెద్ద చ‌ర్చ జ‌రిగిన విష‌యం తెలిసిందే.

అయితె ఇప్పుడు జ‌గ‌న్‌లో మార్పు స్ప‌ష్టంగా కనిపిస్తోంది. మొన్న‌టి మొన్న సాక్షి ఒక్క‌టి ఉంటె స‌రిపోదు మిగితా మీడియా స‌హాక‌రాం క‌వాల‌ని అన్ని ఛాన‌ల్ల సీఈవోల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. మీ పొలిటికల్ అఫీలియేషన్స్ విషయం లో మొహమాట పెట్టను, కేవలం యాత్రకి కవరేజ్ మాత్రం చక్కగా ఇవ్వండి చాలు అని అభ్యర్థిస్తున్నాడు.

అయితె ఇవ‌న్నీ స‌రిపోవంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల‌కు త‌న‌మీద న‌మ్మ‌కం క‌లిగించడంతోపాటు ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకంగాఉన్న ప్ర‌జ‌లంద‌రిని త‌న వైపు తిప్పుకోవాలి. ప్ర‌భుత్వం వైఫ‌ల్యాల‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెల్ల‌గ‌ల‌గాలి. దానికంటె ముందుగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చిత్త‌శుద్ధితో ఉన్నాన‌ని ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని చూర‌గొనాలి. దానికంటె ముందు తన ముఖ్యమంత్రి పదవి కోసం కాదనీ ప్రజలు అనుకునేలా చేయాలి. మ‌రి ఇవ‌న్నీ చేస్తాడాలేదా అన్న‌ది పాద‌యాత్ర‌లో తేలిపోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -