- Advertisement -

డిసెంబర్ 29న తెలుగు .. తమిళ భాషల్లో రిలీజ్ అవ్వ‌నున్న బెలూన్‌..

- Advertisement -

సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం హ‌ర్ర‌ర్ సినిమాలు రాజ్య‌మేలుతున్నాయి. ఎన్ని హ‌ర్ర‌ర్ సినిమాలు వ‌చ్చినా వేటికి అవే సాటి. రోజు రోజుకి దెయ్యం సినిమాల‌పై మాత్రం ప్రేక్ష‌కుల‌లో క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌డంలేదు. ఆనందో భ్ర‌హ్మ‌, రాజుగారిగ‌ది 2 తో పాటు ఇత‌ర హ‌ర్ర‌ర్ సినిమాలు ప్రేక్ష‌కుల‌ను బాగానె అక‌ట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మ‌రో హ‌ర్ర‌ర్ సినిమా రిలీజు కాబోతుంది.

గ‌తంలో అంజ‌లి గీతాంజ‌లి సినిమాలో దెయ్యంగా క‌నిపించి న‌ట‌న ప‌రంగా అద‌ర‌గొట్టేసింది. ఈ సిన‌మా ప్రేక్ష‌కుల‌ను బాగానె అక‌ట్టుకుంది. దెయ్యం పాత్ర‌లో అంజ‌లి న‌ట‌న అద్భుతం. మ‌రో సారి అంజ‌లి దెయ్యంగా ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెడ‌తానంటోంది. తమిళంలో ఆమె ‘బెలూన్’ అనే హారర్ థ్రిల్లర్ సినిమా చేస్తోంది. సినీష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో దెయ్యంగా ఆమె కనిపించనుంది. అంజలి ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాలో, జై .. జోకర్ గా కనిపించనున్నాడు.

గ‌తంలో ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన జెర్నీ సినిమా సూప‌ర్‌హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఇప్ప‌డు మ‌రోసారి వీరి కాంబినేష‌న్‌పై అంద‌రిలోను ఆస‌క్తిని రేపుతోంది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, డిసెంబర్ 29వ తేదీన విడుదల చేయనున్నారు. తమిళంతో పాటు తెలుగులోను అదే రోజున ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ప్రేక్ష‌కుల‌ను ఏమాత్రం భ‌య‌పెడుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -