Saturday, May 4, 2024
- Advertisement -

ఏపీ స్పీకర్ ను కలిసిన వైకాపా ఎమ్మెల్యేలు

- Advertisement -

ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావును వైసీపీ ఎమ్మెల్యేలు కలిశారు. తమ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా స్పీకర్ ను కోరారు. ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలని విన్నవించారు.

గతంలో పార్టీ మారిన ఎమ్యెల్యేలపై ఇచ్చిన ఫిర్యాదులపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. వంతల రాజేశ్వరి ఈ నెల 4వ తేదీన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు, తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని రాజేశ్వరి తెలిపారు.

ఈ సందర్బంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, తమ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని ప్రభుత్వం నడిపిస్తున్నారని విమర్శించారు. దేశంలో విపక్ష ఎమ్మెల్యేలతో నడుస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదేనని ఎద్దేవా చేశారు. వైకాపా ఎమ్మెల్యే పినెల్లి రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ లో చేరిన వంతల రాజేశ్వరి పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కి ఫిర్యాదు చేశామని అన్నారు. సంత లో పశువులను కొన్నట్లు వైసీపీ ఎమ్మెల్యే లను కొన్నారని అయన ఆరోపించారు.

ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని టీడీపీ తుంగలో తొక్కింది.. గతంలో జరిగిన సమావేశాల్లో ప్రజా సమస్యల పై సభ లో మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదని అన్నారు. అందుకే ప్రజా క్షేత్రంలోనే ప్రజా సమస్యలను చర్చించడానికే అసెంబ్లీ ని బాయ్ కాట్ చేసామని అన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -