వారిద్దరూ సంవత్సరాల తరబడి ఘాడంగా ప్రేమించుకున్నారు, ఒకరంటే ఒకరు బతకలేని పరిస్థితి.
ఒక వేడుక లో పరిచయం అయిన వీరిద్దరి పరిచయం కొన్నాళ్ళకి ప్రేమగామారింది, ఈ క్రమం లో ఆమె తల్లిదండ్రులకి విషయం తెలిసి పెద్ద గొడవ కూడా అయ్యింది.
అతన్ని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అంటూ ఇంట్లో వారు సీరియస్ అయ్యారు. తమ ప్రేమని అర్ధం చేసుకోమని ఆ జంట ప్రాధేయ పడింది కానీ వారు మనసులు కరగలేదు తరవాత ఆ అమ్మాయి కి సంబంధాలు కూడా చూద్దాం మొదలు పెట్టడం తో ఇద్దరు పక్కా తల్లి తండ్రులు అసలు తమ మాట వినిపించుకోవడం లేదు అని వారు దూరంగా వెళ్లి పోయి పెళ్లి చేసుకున్నారు.
ఇదంతా రొటీన్ స్టోరీ నే కదా అంటారా? ప్రతీ ప్రేమ జంట నుంచీ వచ్చే స్టొరీ నే తప్ప ఇందులో విశేషం ఏముంది? అంటారా? నిజమీ కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
వారు పెళ్లి చేసుకున్న తరవాత ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో ఎదురు అయ్యి, కుటుంబ సభ్యులు ఒకరికి ఒకరు తారస పడిన క్షణం లో పిడుగు లాంటి వార్త వారి మీద పడింది .. ” మీరిద్దరూ వరసకి అన్నా చెల్లెళ్ళు అవుతారు ” అని వారి కుటుంబాలు దృవీకరించిన మాట వినగానే వారి మతులు పోయాయి, జరిగినది పెద్ద అపచారం అని తెలుసుకున్న వాళ్ళు వెంటనే పోలీసులని ఆశ్రయించి విడాకుల కోసం కోరుతున్నారు ప్రస్తుతం.