ఈనెలలో సినిమాలన్నీ వరుసగా విడుదల అవుతున్నాయి. గత శుక్రవారం కూడా దాదాపు 9 చిన్నాపెద్దా సినిమాలు విడుదలయ్యాయి. ఈ శుక్రవారం కూడా దాదాపు 7 సినిమాలు విడుదలయ్యాయి. పూర్తయిన చిన్న సినిమాలతో సహా, డబ్బింగ్ సినిమాలు, ఒక మోస్తరు సినిమాలు కలుపుకుని దాదాపు 7 సినిమాల వరకు రిలీజవుతున్నాయి. నారా రోహిత్, రెజీనా నటించిన పవన్ మల్లెల దర్శకత్వంలో ‘బాలకృష్ణుడు’ సినిమా వస్తోంది. శ్రీవిష్ణు నటించిన ‘మెంటల్ మదిలో’ విడుదలవుతోంది. ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. భూపాల్ రాజు, ధన్ రాజ్, మనోజ్ నందన్‌లు కలిసి నటించిన ‘దేవి శ్రీ ప్రసాద్’ కూడా వచ్చింది. ఈ సినిమా హర్రర్ నేపథ్యంలో కొనసాగనుంది. ఫిదా ఫేమ్ సాయి పల్లవి, దుల్కర్ సల్మాన్ మలయాళ సినిమా ‘కాళి’ డబ్బింగ్‌తో తెలుగులో ‘హేయ్ పిల్లగాడా’ సినిమా కూడా ఈ శుక్రవారం విడుదలయ్యింది.
అలాగే ఇప్పట్లో రాముడిలా, సీతలా ఎవరుంటారండీ బాబు, జంధ్యాల రాసిన ప్రేమ కథ’ వంటి చిన్న సినిమాలు విడుదలయ్యాయి. ‘ప్రతినిధి’తో రచయితగా మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్ రవి దర్శకత్వం వహించిన ‘నెపోలియన్’ కూడా ఈ శుక్రవారమే రానుంది. నా నీడ పోయింది అనే పోస్టర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రగిల్చారు. ఇలా వరుస సినిమాలు విడుదలవడంతో థియేటర్లు ఫుల్లయ్యాయి. అయితే ప్రధానం మెంటల్ మదిలో, బాలకృష్ణుడు, హేయ్ పిల్లగాడా సినిమాలపై అంచనాలు ఉన్నాయి. ఈ విధంగా సినిమాలు వరుసగా విడుదలయితే పరిశ్రమకు పండగే పండగ. ఇక నవంబర్ 30వ తేదీన కూడా చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అభిమాన, ప్రేక్షకులు సిద్ధంగా ఉండండి.