Sunday, May 5, 2024
- Advertisement -

చిన్న అనౌన్స్‌మెంట్‌

- Advertisement -
  • ఈ సాయంత్రం 6 గంట‌ల‌కు నిర్మాణ రంగంలోకి ఎంట్రీ

న్యాచుర‌ల్ స్టార్ నాని ఈ రోజు సాయంత్రం 6 గంట‌ల‌కు చిన్న అనౌన్స్‌మెంట్ చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఆయ‌న ప్ర‌క‌ట‌న‌తో అంద‌రూ ఏమిట‌ని టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఆయ‌న ఏం ప్ర‌క‌ట‌న చేస్తాడ‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్‌లో ఓ వీడియోను విడుద‌ల చేశారు. తాను ఓ సినిమా నిర్మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపాడు. ఈ పాటికే సినిమాల‌తో బిజీగా ఉన్న నాని సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు.ఎక్సైట్‌మెంట్ ఎక్కువ‌గా ఉంద‌ని అంద‌రూ వేచి ఉండాల‌ని అభిమానులు, ప్రేక్ష‌కుల‌కు చెప్పాడు.

ఇంత‌కు ఆ వీడియోలో ఏం చెప్పాడంటే ప్ర‌శాంత్ అనే వ్య‌క్తి ఓ ఆరు నెల‌ల కింద‌ట త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఓ క‌థ చెప్పాడ‌ట‌. క‌థ బాగా న‌చ్చింద‌ని, ఆ సినిమా బాగా తీయాల‌ని స‌ల‌హా ఇచ్చాడు. అయితే ప్రొడ్యూస‌ర్ ఎవ‌రూ అని అడ‌గ్గా ఎవ‌రూ లేరు అడ్జ‌స్ట్ చేస్తున్నాం అనేగానే నేను చేస్తాన‌ని నాని ముందుకు వ‌చ్చాడ‌ట‌. ఆ విధంగా ఆ సినిమాను నాని నిర్మిస్తున్నాడ‌ట‌. ఇక ఆ సినిమా షూటింగ్ కూడా 80 శాతం పూర్త‌యింద‌ని, ఇంకా 20 శాతం త్వ‌ర‌లోనే పూర్తిచేసి ఫిబ్ర‌వ‌రిలో మీ ముందుకు తెస్తాన‌ని నాని అభిమానులు, ప్రేక్ష‌కుల‌కు శుభవార్త చెప్పాడు. ఇంత‌కు ఆయ‌న తీస్తున్న సినిమా పోస్ట‌ర్ ఈ రోజు సాయంత్రం 6 గంట‌ల‌కు విడుద‌ల చేస్తామ‌ని, చిన్న ఎక్స‌యిట్‌మెంట్‌లో ఉన్నాన‌ని ప్ర‌క‌టించాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -