Saturday, May 25, 2024
- Advertisement -

మురళీ విజయ్ హాఫ్ సెంచ‌రీ .. భారీ స్కోరు దిశగా భారత్

- Advertisement -

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 42 పరుగులు చేసింది. లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నప్పటికీ భారత్‌ బ్యాట్స్‌మెన్‌ నిలకడగా రాణిస్తున్నారు. స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ మంచి భాగస్వామ్యం నెలకొల్పేలా అడుగులు వేస్తున్నారు.

రెండో టెస్టులో ఓపెనర్ మురళీ విజయ్ సత్తా చాటాడు. టెస్ట్ కెరీర్ లో 16వ అర్ధ శతకాన్ని సాధించాడు. మ్యాచ్ రెండో రోజు ఒక వికెట్ నష్టానికి 11 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆటగాళ్లు తొలుత నెమ్మదిగా ఆడుతూ, క్రీజులో కుదురుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా పరుగుల వేగాన్ని పెంచారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మురళీ విజయ్, చటేశ్వర్ పుజారాలు ఆతున్నారు. ఈ క్రమంలో ఫోర్ సహాయంతో విజయ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు వికెట్ నష్టానికి 95 పరుగులు. పుజారా (32), విజయ్ (55) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ మరో 112 పరుగులు వెనకబడి ఉంది. వికెట్ తీయ‌డానికి లంక బౌల‌ర్లు శ‌త‌విధాల చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -