2017 సంవత్సరం చివరికి వచ్చేశాం. వచ్చే ఏడాదికి ఒక నెలమాత్రమే మిగిలింది. తాజాగా యాహూ తమ సెర్చ్ ఇంజిన్లో నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన వారి జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది యాహూలో అధికంగా సెర్చ్ చేసిన భారత సినిమా నటీమణుల జాబితాను ప్రకటించింది.
ఈ సంవత్సరం కూడా మొదటి ప్లేస్ ఎవరికి దక్కిదంటే… ఎప్పటిలాగే మళ్లీ సన్నీలియోన్ అగ్రస్థానంలో నిలిచింది. తన తరువాతే ఎవ్వరైనా అన్నట్లు ఆ శృంగార నటి దూసుకుపోతోంది. ఆమె తరువాతి స్థానాల్లో ప్రియాంకా చోప్రా, ఐశ్వర్యారాయ్ ఉన్నారు.
ఇక నటుల జాబితాలో ప్రముఖ నటుడు వినోద్ ఖన్నా టాప్ ప్లేస్లో నిలిచారు. వినోద్ ఖన్నా మృతి చెందిన సమయంలో నెటిజన్లు ఎక్కువగా ఆయన కోసం యాహూలో సెర్చ్ చేశారు. కాగా, ఆ తర్వాతి స్థానంలో అనూహ్యంగా కపిల్ శర్మ నిలిచారు. సల్మాన్ ఖాన్, రజినీ కాంత్ లాంటి వారిని దాటుకుని కపిల్ శర్మ రెండో స్థానంలో నిలవడం విశేషం.
2017 యాహూ మోస్ట్ సెర్చ్డ్ హీరోయిన్ల జాబితా…
సన్నీలియోన్
ప్రియాంకా చోప్రా
ఐశ్వర్య రాయ్
కత్రినా కైఫ్
దీపికా పదుకునే
కరీనా కపూర్
మమతా కులకర్ణి
దిశాపటాని
కావ్యా మాధవన్
ఇషా గుప్తా
