Tuesday, May 14, 2024
- Advertisement -

ఎన్టీఆర్-చరణ్ సినిమా… బాహుబలి స్థాయి పబ్లిసిటీ ఐడియాను పట్టేసిన రాజమౌళి

- Advertisement -

బాహుబలి సినిమా సాధించిన కలెక్షన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది ప్రేక్షకులకు బాహుబలి కలెక్షన్స్ రికార్డ్స్ అన్నీ ఫింగర్ టిప్స్‌పైనే ఉంటాయి. అయితే క్వాలిటీ విషయంలో బాహుబలి1, బాహుబలి2 సినిమాలు మరీ గొప్పవేం కాదని విమర్శించే జనాలు కూడా తక్కువేం కాదు. పేరున్న క్రిటిక్స్ కూడా బాహుబలిని తీవ్రస్థాయిలో విిమర్శించారు. కమల్ హాసన్ లాంటి వాళ్ళతో పాటు తెలుగు సినిమా టాప్ డైరెక్టర్స్, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ కూడా బాహుబలి సినిమాని ఒక సాదాసీదా కమర్షియల్ సినిమా అనే చెప్పారు. రివ్యూస్ కూడా అలానే వచ్చాయి. అయితే గ్రాఫిక్స్ మాత్రం అద్భుతం అని చెప్పొచ్చు. ఇండియన్ సినిమాల స్టాండర్డ్స్‌లో చూస్తే ది బెస్ట్ గ్రాఫిక్స్ అని కూడా చెప్పొచ్చు. కానీ కథ, కథనాల విషయంలో మాత్రం బాహుబలి స్థాయి సాదా సీదానే. మరి అలాంటి సినిమా బాలీవుడ్ సినిమాలను తలదన్ని ఇండియాలోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఎలా నిలబడింది? అదే రాజమౌళి పబ్లిసిటీ మహత్యం. సినిమా మేకింగ్ విషయంలో రాజమౌళిని మించిన డైరెక్టర్స్ ఉన్నారు కానీ రాజమౌళి స్థాయిలో పబ్లిసిటీ చేయడంలో మాత్రం అమీర్ ఖాన్‌లాంటి వాళ్ళకు కూడా చేతకాదు. పబ్లిసిటీ చేయడం విషయంలో మాత్రం ఇండియాలోనే నంబర్ ఒన్ సినిమా టెక్నీషియన్ రాజమౌళి అని సందేహం లేకుండా చెప్పొచ్చు.

ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్-చరణ్‌లతో మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్న రాజమౌళి బౌండ్ స్క్రిప్ట్‌ని ఇంకా ఫైనల్ చేయలేదు. కానీ పబ్లిసిటీ ఎలా చేయాలి అనే విషయంలో మాత్రం ఓ సూపర్ కాన్సెప్ట్‌ని పట్టేశాడు. తెలుగు నాట కులాల గొడవల గురించి కొత్తగా చెప్పేదేముంది. మరీ ముఖ్యంగా ఎనభైల వరకూ నంబర్ ఒన్‌గా ఉన్న ఎన్టీఆర్….ఆ తర్వాత నంబర్ ఒన్ హోదా దక్కించుకున్న చిరంజీవి కులాల ప్రేక్షకుల మధ్య పోరు మామూలుగా ఉండదు. ఒకప్పుడు ఎన్టీఆర్-చిరంజీవి కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేశారు కానీ ఆ తర్వాత నుంచీ మాత్రం ఆయా కులాల మధ్య గొడవలు కూడా కలెక్షన్స్‌ని, ఫ్యాన్ బేస్‌ని పెంచే పరిస్థితి ఉండడంతో అగ్రస్థానానికి పోటీ పడ్డ హీరోలు సీక్రెట్‌గానే స్నేహాలు చేశారు. కానీ ఫ్యాన్స్‌ని మాత్రం బాగానే రెచ్చగొట్టారు. అయితే ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పరిస్థితులు మారిపోయాయి. అన్ని కులాల వాళ్ళూ…..ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులకు సినిమాను రీచ్ చేస్తూ కలెక్షన్స్ కొల్లగొట్టే ఐడియాలు వచ్చాయి. రాజమౌళి స్థాయిలో ఖర్చుపెట్టించాలంటే మార్కెట్‌ని పెంచుకోవడం, ప్రేక్షకులందరినీ సినిమా థియేటర్‌కి రప్పించడం అవసరం .

అందుకే గత కొన్నాళ్ళుగా హీరోలందరూ కూడా వాళ్ళ సీక్రెట్ స్నేహాలను బహిరంగపరుస్తున్నారు. హార్డ్ కోర్ అభిమానులను కూడా కన్విన్స్ చేస్తున్నారు. ఒక్క పవన్ కళ్యాణ్‌ని మినహాయిస్తే మిగతా హీరోలందరూ కూడా అందరు హీరోల అభిమానులనూ ఆకట్టుకునేలా మాట్లాడుతున్నారు. పవన్ యాక్టింగ్ స్కిల్స్, రాజకీయ అవసరాల రీత్యా పవన్‌కి మాత్రం హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇంకా హార్డ్ కోర్‌గా తయారవడం అవసరం. ఆ విషయం పక్కనపెడిేత ఇప్పుడు రాజమౌళి కూడా ఈ విషయాన్నే తన పబ్లిసిటీకి వాడేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. దశాబ్ధాలుగా రెండు అగ్ర కులాల మధ్య ఉన్నగొడవలను ఈ సినిమాతో తగ్గించబోతున్నానని పబ్లిసిటీ చేసుకోనున్నాడు. అలాగే ఫ్యాన్స్ మధ్య గొడవలు, కులాల మధ్య గొడవలు తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో రాజమౌళికి మాత్రమే ఎన్టీఆర్-చరణ్‌లతో మల్టీస్టారర్ తీయడం సాధ్యమైంది అని పబ్లిసిటీ ప్లాన్ చేయనున్నారు. ఆ రకంగా ఈ సినిమాతో రాజమౌళి సమాజానికి చాలా మేలు చేస్తున్నాడన్న కలర్ ఇవ్వబోతున్నారు. ఇవన్నీ ఒక రకంగా నిజాలు కూడా. కానీ టిడిపి జనాలు, ఆ పార్టీ భజన మీడియా మాత్రం 2014లో కాపుల రిజర్వేషన్స్ అని చెప్పి, పవన్ కళ్యాణ్ చేసిన బాబు భజన పుణ్యమా అని కాపుల ఓట్లు కొల్లగొట్టినట్టుగా ఈ సారి రాజమౌళి సినిమాను క్యాష్ చేసుకోవడం ఖాయం.

ఇంచుమించుగా 2019 ఎన్నికలకు కాస్త ముందుగానే ఈ సినిమా వస్తుందని చెప్తున్నారు. ఆ రకంగా టిడిపి భజన మీడియా మొత్తం ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేయడం ఖాయం. బాహుబలి సినిమా విజయాన్నే క్యాష్ చేసుకోవాలని చూసిన చంద్రబాబు, రాజమౌళి క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని చూసిన చంద్రబాబు ఈ సినిమా పబ్లిసిటీని ఓ రేంజ్‌లో క్యాష్ చేసుకుంటాడనడంలో సందేహం లేదు. ఈ పబ్లిసిటీ స్టంట్స్ క్లిక్ ఎన్టీఆర్-చరణ్ సినిమా కూడా బాహుబలి స్థాయి కలెక్షన్స్ సాధిస్తుందా? 2019 ఎన్నికల్లో మరోసారి కాపుల ఓట్లు చంద్రబాబుకు పడేలే టిడిపి భజన మీడియా చేయగలదా? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -