బొద్దింకలు ఇళ్లలో ఉండటం సర్వసాధారనం. వాటిని చూస్తానే అసహ్యించకుంటారు. చూడటానికి చిన్నవిగా ఉన్నా దాన్ని చూస్తే మహిళలు పరుగులు తీస్తారు. తినడానికి వండుకున్న గిన్నెల్లో దూరి నానా హంగామా చేసి అనారోగ్యాలకు బొద్దింకలు కారణమౌతుంటాయి. కాని ఇప్పటినుంచి ఆలా కాదు. వాటిని హాయిగా ఆరగించేయచ్చు. వాటిల్లో ఉన్న పోషకాలు ఇంకేదాంట్లో ఉండవు. ఇది నేను చెప్తున్నదికాదు…శాస్ట్రవేత్తలు చెప్తున్నారు.
మన దేశంలో అంటే వీటిని తినడానికి ఇష్టపడరు కానీ.. ఇతర దేశాల్లో బొద్దింకలాంటి మరికొన్ని కీటకాలను ఆహారంగా తీసుకుంటారు. ఈ బొద్దింకలను కుక్ చేసినప్పుడు అందులోని బ్యాక్టీరియా చనిపోతుంది. తర్వాత దాన్ని ఆహారంగా తీసుకోవచ్చు.
వాటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలేమి రావని నిపుణులు చెబుతున్నారు. థాయిలాండ్ లో బొద్దింకలతో చేసిన ఆహారాన్ని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారట. అంతేకాదు.. అవి కరకరలాడటానికి డీప్ ఫ్రై చేసుకొని మరీ తింటారట. ఇవే కాదు ఇతర దేశాల్లో బొద్దింకలతోపాటు వివిధ రకాలు కీటకాలను ఆహారంగా తీసుకుంటారు. భవిష్యత్తులో ఇవి కూడా మనుషులకు ఆహారంగా ఉపయోగపడుతాయి.
