Monday, May 20, 2024
- Advertisement -

హమ్మయ్య… జ్యోతి సర్టిఫికెట్ ఇచ్చింది….. రాహుల్ బాబా మా గొప్ప లీడర్ అయిపోయాడోచ్….. అట

- Advertisement -

ఊసరవెల్లులు కూడా సిగ్గు పడాల్సిందే. తెలుగు నాట ఉన్న చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న విషయం కూడా ఏంటంటే…..ప్రస్తుతం చంద్రబాబు చేతిలో అధికారం ఏమీలేదని……అంతా కూడా ఆయన భజన మీడియా అధినేతలు, వాళ్ళ వందిమాగధులు నడిపిస్తున్నారని. చూస్తుంటే వాళ్ళ మాటలు నిజమే అని కూడా అనిపిస్తోంది. రాజకీయ రంగులు మార్చడం, వ్యూహాలు మార్చుకోవడం లాంటి విషయాలన్నీ కూడా భజన మీడియా అధినేతలే డిసైడ్ చేస్తున్నారేమోననిపిస్తోంది.

2014 లో బిజెపితో పొత్తు కుదరనంత వరకూ కూడా బిజెపిని చంద్రబాబు ఏ స్థాయిలో విమర్శించాడో చెప్పనవసరం లేదు. ఇక నరేంద్ర మోడీనయితే హైదరాబాద్‌లో అడుగుపెడితే అరెస్ట్ చేయిస్తానని కూడా ఆ మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఆవేశపడ్డాడు. మతతత్వ బిజెపితో పొత్తు పెట్టకునే ప్రసక్తే లేదని ముస్లిములకు ఎన్ని ప్రమాణాలు చేశాడో చెప్పనవసరం లేదు. కానీ 2014 ఎన్నికల సమయానికి జగన్ ప్రజాదరణను ఎదుర్కోవాలంటే రాజకీయ వ్యూహాలు తప్పదని భావించి ఓ వైపు హామీల వర్షం కురిపించాడు….మరొవైపు నరేంద్రమోడీతో పొత్తు పెట్టకున్నాడు. ఇక పవన్‌లాంటి చిడతల బ్యాచ్‌ని కూడా రంగంలోకి దించాడు. ఇక ఆ తర్వాత నుంచీ బిజెపి పార్టీని మించిన పార్టీ లేదని….నరేంద్రమోడీని మించిన నాయకుడు ముల్లోకాలలోనూ లేడని భజన మీడియా మొత్తం ఏ స్థాయిలో వార్తలు రాసిందో చెప్పనవసరం లేదు. విభజన పాపంలో బిజెపికి కూడా సమాన భాగం ఉన్నప్పటికీ తమ భజన నైపుణ్యంతో మోడీని హీరోని చేసిపడేసి సీమాంద్రుల చేత ఓట్లేయించారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీమాన్ నరేంద్రమోడీవారు, వెంకయ్యనాయుడు, చంద్రబాబులు సీమాంద్రులకు ఏ స్థాయిలో చుక్కలు చూపించారో చెప్పనవసరం లేదు.

కట్ చేస్తే నాలుగేళ్ళ తర్వాత ఎక్కడ తేడా వచ్చిందో కానీ మోడీకి బాబుకి చెడింది. ఇక ఇప్పుడు భజన మీడియా మొత్తం కూడా వ్యూహం మారుస్తోంది. మొన్నటి వరకూ రాహుల్‌బాబాలాగా, కమెడియన్‌లాగా కనిపించిన రాహుల్‌గాంధీ గొప్ప నాయకుడిలా కనిపిస్తున్నాడు. త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో ఓటర్లను నరేంద్ర మోడీ కంటే ఎక్కువగా ప్రభావితం చేస్తున్న నాయకుడిగా కనిపిస్తున్నాడు. వీళ్ళ తీరు చూస్తుంటే సోనియా అమ్మతో పొత్తు కుదిరితే సీమాంద్ర ఓటర్ల చేత కాంగ్రెస్‌కి కూడా ఓట్లేయించేలానే కనిపిస్తున్నారు. అధికారం కోసం అంతపనీ చేయగల ఘనులే. ఇక తమకు దూరం అయిన తర్వాత ఎక్కడ బిజెపివాళ్ళు జగన్‌తో చేతులు కలుపుతారో అన్న భయంతో బిజెపిని మతతత్వపార్టీగా చూపించే ప్రయత్నాన్ని కూడా గట్టిగానే చేస్తున్నారు.

అధికారం కోసం ఏం చేయడానికైనా…….సీమాంద్రులను దగా చేసిన వాళ్ళకు కూడా ఓట్లేయించడానికి రెడీ అయ్యేవీళ్ళు కుర్చీ మీద ఆశలేని వాళ్ళు…..జనాల్లో తిరగడం……ధర్నాలు, నిరాహార దీక్షలు, పాదయాత్ర చే్స్తూ జనాల మెప్పు పొంది అధికారంలోకి రావాలని చూస్తున్న జగన్ మాత్రం పదవీ వ్యామోహం ఉన్నవాడు……శభాష్….జర్నలిజం అదిరిపోలా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -