హ్యపీడేస్‌తో మొదలైన నిఖిల్ సిద్ధార్థ్ కొత్త కొత్త సినిమాలు చేసుకుంటూ సినీ పరిశ్రమలో కొనసాగుతున్నాడు. ఈమధ్య కొత్త కొత్త జోనర్లలో సినిమాలు చేసుకుంటూ విజయాలు పొందుతున్నాడు. ఈ యువ నటుడు ఫిబ్రవరి 9వ తేదీన కిర్రాక్ పార్టీ చేస్కుందాం అని ప్రేక్షకులకు చెబుతున్నాడు. నిఖిల్ చాలా రోజుల తర్వాత రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాతో వస్తున్నాడు. కన్నడ మూవీ కిరాక్ పార్టీ తెలుగు రీమేక్‌తో ప్రేక్షకులకు వస్తున్నాడు.
కన్నడలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తన సినిమాను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ సినిమాలు విడుదల కాని సమయంలో వస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు… సమ్మర్‌కు చాలా సినిమాలు వస్తున్నాయి. వీటి మధ్యలో ఫిబ్రవరి కొంచెం ఖాళీగా ఉంది. ఈసమయంలో సేఫ్‌జోన్‌గా భావించి నిఖిల్ సినిమా వస్తోంది. అందుకే ఫిబ్రవరి 9వ తేదీన ఈ కిరాక్ పార్టీ విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా వస్తోంది. సంయుక్త హెగ్డే, సిమ్రన్ పరింజా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రేమమ్ ఫేం చందు మొండేటి స్క్రీన్ ప్లే బాధ్యతలు చూస్తుండగా.. స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ డైలాగులు రాశాడు.