ఋషులు,మహర్షులు మాత్రమే జులపాలు పెంచుకుంటారు.
ఆతర్వాత జులపాలు పెంచేది ఖచ్చితంగా గొర్రెలే.మరి ఎంత తపస్సు చేస్తే ఈ గొర్రె ఇలా బొచ్చు పెంచుకుందో తెలియదుగాని ఏకంగా తన వంటిపై 41 కిలోల బొచ్చును పెంచేసుకుంది. మనుషులకైతే సెలూన్లు ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు కత్తిరింపులు ఉంటాయి.మరి వీటికేం ఉంటాయి చెప్పండి.
ఇంతకీ ఈ గొర్రె పేరు చెప్పలేదు కదూ .దీని పేరు క్రిస్ .ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ -ఏసీటీ బోర్డగర్ లోని మల్లిగాన్స్ ఫ్లాట్స్ లో ఉంది.అత్యధిక ఉన్ని కలిగిన గొర్రెగా ఇపుడిది ప్రపంచ రికార్డు సృష్టించింది.
క్రిస్ బొచ్చు కత్తిరింపులో ఇయాన్ ఎల్కిన్స్ తన నలుగురి సహాయకులితో కలిసి ఏకంగా 45 నిమిషాలు శ్రమించి క్రిస్ కు ఇలా ఉన్ని భారం తగ్గించి ఉపశమనం కల్గించారు. ఫొటోలోని క్రిస్ ను చూస్తే…ఇంతకాలానికి నాకు మానవుల చేత విముక్తా అని ఎంతో ఆనందిపడినట్లుగా ఉంది చూడండి.
విశేషమేమిటంటే…ఇంతటి బొచ్చుతో క్రిస్ ఇంతకాలం ఎలా బతికిందనేది జంతు వైధ్యులకు అంతు చిక్కడం లేదు.
