- Advertisement -

రామోజీకీ – చంద్రబాబుకీ ఇగో క్లాష్ ?

- Advertisement -

రామోజీ రావు – చంద్రబాబు నాయుడులది ఈ నాటి బంధం కాదు. 

ఎన్టీఆర్ తరవాత తెలుగుదేశం పార్టీ కి చాలా ఫండింగ్ కూడా చేసారు రామోజీ అని అప్పట్లో అనే వారు. ప్రభుత్వ వ్యవహారాల్లో రామోజీ తీవ్రంగా తలదూరుస్తూ ఉంటారు అని చాలా విషయాల్లో తనకి నచ్చిన వారికే పదవులు కట్ట బెట్టడంలో రామోజీ భారీ ప్రయత్నాలే చేసారు అని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈనాడు లాంటి ఒక నిక్కచ్చైన పత్రిక నడుపుతున్నా రామోజీ కొన్ని వ్యవహారాలు చీకట్లోనే కానిచ్చేవారు అని ఇప్పటికీ ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్న. 

ఇప్పుడు మన విషయం లోకి వద్దాం అప్పట్లో బాబూ – రామోజీ ల మధ్య సయోధ్య ఇప్పుడు వారి ఇద్దరికీ మధ్యన ఉన్న సయోధ్యా ఒకటేనా ? మారిందా? తేడాలు వచ్చాయా? అంటూ అవును అనే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబు రాజధాని మీద చూపు ఇప్పుడు దేశీయంగా కనపడ్డం లేదు. ప్రపంచ స్థాయి రాజధాని ని నిర్మించే పనిలో ఉన్నాం అంటూ భేషిజాల సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రతీ దానికీ రామోజీని సలహా తీసుకోవడం ఆయన ద్వారా ఏదైనా సాధ్యపడుతుందా లేక ఆయన నుంచ ఎలాంటి సహకారం వస్తుంది అనేది చూసుకున్న బాబు ఈ దఫా  ఏమైనా ఐడియా వుందా..లేదా ఏమైనా చేద్దామని వుందా అని ఒక్క మాట కూడా రామోజీని అస్సలు అడగలేదు చంద్రబాబు అన్నది రాజకీయ వర్గాల బోగట్టా. 

అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ సిటీ కట్టి, ఇప్పుడు ఓం సిటీ నిర్మాణానికి తలకెత్తుకున్న రామోజీ రావు తలుచుకుంటే ఏదో ఒక అధ్భుతం రాజధానికి సమకూరుస్తారు. ఆయన మొదటే అడిగి ఉంటే బాబు కూడా కాదు అనరు. కానీ అది కాదట సమస్య బాబు అంతట బాబే ఈ విషయం ఎత్తాలి కదా అనేది రామోజీ కి ఇగో మీద కొట్టేసింది. ప్రస్తుతం రామోజీ దృష్టి అంతా ఓం సిటీ మీదనే ఉంది అని అందుకే సైలెంట్ గా ఉన్నారు అని మరికొందరి వాదన. అయినా బాబు ఒక మాట అడిగి ఉండాలి లెండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -