మన అందరికీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ బాగా పరిచయమే.ఆయన అందరికి సాహిత్యవేత్తగానే తెలుసు కాని ఆయనలో ఒక రాజకీయ కోణం ఉందని చాలా మందికి తెలియదు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చాలాకాలం కొనసాగారు.ఈయన ఎన్టీఆర్‌కు,ఆయన తనయుడు హరికృష్ణకు విధేయుడిగా ,భక్తుడిగా ఉండేవాడు.ఆయన రాజ్యసభ ఎంపీగా కూడా నామినేట్ అయ్యారు.ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు చేతుల్లోకి 1995లో అధికార మార్పిడిలో సంచలన పరిణామాలు జరిగాయి. ఆ సందర్భంలో చంద్రబాబుకు బాగా మద్దతు ఇచ్చిన వారిలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఒకరు.
అయితే చంద్రబాబే ఆయనకు పదవి ఇచ్చారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు యార్లగడ్డకు పదవి ఇవ్వడానికి ఇష్టపడలేదట. ఈ విషయం తెలుసుకున్న హరికృష్ణ పట్టుబట్టి మరీ చంద్రబాబును బలవంత పెట్టి యార్లగడ్డకు పదవి ఇప్పిచ్చారట. తరువాత జరిగిన పరిణామంతో బాబు హరికృష్ణకు మంత్రి పదవి ఇవ్వలేదు .ఈ విషయంపై చంద్రబాబును యార్లగడ్డ అడగ్గా ఆయన నీకు దగ్గరా నాకు దగ్గరా మా బావ మరిది అని కొంత చర్చ నడిచిందని చెప్పారు.అప్పటి నుండి బాబుకు-యార్లగడ్డకు మధ్య బాగా గ్యాప్ పెరిగిందట. ఈ విషయాన్ని స్వయంగా యార్లగడ్డే చెప్పుకొచ్చారు.