ఎవరో ఒకరు చేసిన మార్ఫింగ్ ఫొటోను రామ్‌గోపాల్ వర్మ ముచ్చటపడ్డాడు. ఎప్పుడు పవన్ గురించి మాట్లాడి సంచలనాలకు తెర లేపే వర్మ ఏకంగా పవన్‌ను ముద్దాడుతున్న ఫొటోను తన ఫేస్బుక్ పేజీలో షేర్ చేశాడు. పవన్‌ను పొగడ్డంలో తనకు తానే సాటి అని గతంలో చాలాసార్లు రుజువు చేసుకున్న వర్మ.. మరోసారి అతిశయోక్తి మాటలతో వచ్చేశాడు. ‘అజ్ఞాతవాసి’ టీం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. రిలీజ్ చేసిన పోస్టర్లలో పవన్ లుక్స్ చూసి వర్మ ఫ్లాటయ్యాడంట. వెంటనే పవన్‌కు ముద్దు ఇచ్చాడని ఎవరో ఫొటోను మార్ఫింగ్ చేస్తూ వదిలారు. వర్మ కంటపడడంతో బహిర్గతం చేశాడు.
`తాను గే కాదని అందరికీ తెలుసని. కానీ ప్రపంచంలో ఉన్న మొత్తం అందమైన అమ్మాయిలు అందరూ ఒక వైపున్నా తాను ఈ పోస్టర్లో ఉన్న అబ్బాయినే చూజ్ చేసుకుంటానంటూ పవన్ ఇంటెన్స్ లుక్‌లో ఉన్న ఫొటోనుద్దేశించి కామెంట్ చేశాడు వర్మ. ఇక వారణాసి బ్యాక్ డ్రాప్లో ఉన్న పోస్టర్‌ను ఉద్దేశించి స్పందిస్తూ.. తాను తన గత జన్మలో కూడా ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని చూడలేదని.. రజినీకాంత్.. అమితాబ్ బచ్చన్ ఎందుకూ పనికి రారు పీకే ముందు.. బ్రూస్ లీకి మొగుడిలా ఉన్నాడని పవన్ కు కితాబిచ్చాడు వర్మ.
అంతటితో ఆగకుండా ‘‘పవన్ కల్యాణ్ ముందు పుట్టాడా? ఎమోషన్ తర్వాత పుట్టిందా? అనేది చెట్టు ముందా విత్తు ముందా? కోడి ముందా గుడ్డు ముందా? అనే అనాది ప్రశ్నకి నా సమాధానం పవన్‌కల్యాణ్ ముందు పుట్టి మనందరికీ ఇప్పుడు ఎమోషన్ నేర్పుతున్నాడని.. హ్యాట్సాఫ్ పీకే’’ అని వర్మ పేర్కొన్నాడు.
