Sunday, May 5, 2024
- Advertisement -

అజ్ఞాత‌వాసిలో ఆ రెండు సీన్లు సూప‌రంట‌..!

- Advertisement -

కాట‌మరాయుడు ప‌రాజ‌యంతో విజ‌యం కోసం ప‌రిత‌పిస్తున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న స్నేహితుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో జోడీ క‌ట్టాడు. ఈసారి ఎలాగైనా అత్తారింటికి దారేది మాదిరి విజ‌యం సాధించాల‌ని ప‌వ‌న్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. అందుకు త‌గ్గ‌ట్టే సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. రోజులు గ‌డిచిపోవ‌డానికి చిత్ర‌బృందం ఎదురుచూస్తోంది.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో అజ్ఞాతవాసి సినిమా జ‌వ‌న‌రి 10వ తేదీన సంక్రాంతికి ముందు విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమా గురించి కొన్ని లీకులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. సినిమా సూప‌ర్‌హిట్‌గా నిలిచేది అవుతుంద‌ని స‌మాచారం. ముఖ్యంగా కొడ‌కా పాట అనేది సినిమాకే హైలెట్ అంట‌. వెంకటేష్ అతిథి పాత్ర అదిరిపోతుంద‌ని, అత‌డి ఎంట్రీని సినిమాకు ప్ల‌స్‌గా మిగులుతుందంట‌. కొడకా.. కోటేశ్వరరావు పాట, వెంకటేష్ గెస్ట్ ఎంట్రీ రెండూ ఈ సినిమాలో ముఖ్యమంట‌. ఆ రెండూ సెకండాఫ్‌లోనే పవన్ చిత్రంలోని మిగితా అంశాలతోపాటు కొడుకో.. వెంకీ ఎంట్రీ రెండు కూడా ప్రత్యేకంగా సినిమా రెండో భాగంలో ఉన్నాయట. ఈ రెండు కూడా థియేట‌ర్ల‌లలో కాగితాలు గాల్లోకి ఎగ‌ర‌డం.. విజిల్స్‌, కేక‌లతో థియేట‌ర్లు మార్మోగుతాయంట‌.

ఫ్యాన్స్‌కు కిక్కెక్కించేలా సాధారణంగా సినిమాను తీయ‌నున్నారు. సెకండాఫ్‌లో మరికొన్ని అంశాలను చేర్చి ఎక్క‌డా ఫ్యాన్స్ నిరాశ‌ప‌రిచేలా ఉండ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. సెకండాఫ్‌లో అజ్ఞాతవాసి చిత్రంలో కీలకంగా వెంకీ ఎంట్రీ, కొడ‌కా పాట పెట్టిండ్ర‌ని టాక్‌. మొత్తానికి ప‌వ‌న్ అభిమానుల‌కు అజ్ఞాత‌వాసితో పండుగ చేసుకునే అవ‌కాశం ఉంది.

హసిని, హారిక బ్యానర్‌పై నిర్మాత రాధాకృష్ణ నిర్మాణంలో అజ్ఞాతవాసి జనవరి 10వ తేదీన విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేశ్ హీరోయిన్లుగా, ఖుష్బూ, రావు రమేశ్‌, బోమన్ ఇరానీ తదితరులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా పాట‌లు ఆక‌ట్టుకుంటున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -