ప‌వ‌న్ క‌ళ్యాన్‌పై ఆస‌క్తిక‌ర ట్వీట్ చేసి బండ్ల గ‌నేష్‌…ఆలోచ‌న‌లో నెటిజ‌న్లు

ప‌వ‌న్ క‌ళ్యాన్ వీరాభిమాని బండ్ల‌గ‌నేష్ మ‌రో సారి త‌న అభిమానాన్ని చాటుకున్నారు.పవ‌న్ అంటే త‌న‌కు ఎంతభిమాన‌మో త‌రుచూ చెప్తుంటారు. పవన్ కల్యాణ్ నాకు దేవుడితో సమానం’ అంటూ ఆయనపై తనకు ఉన్న వీరాభిమానాన్ని పలు సందర్భాల్లో బండ్ల గణేష్ బయటపెట్టారు.

అయితే ఇప్పుడు నాలుగు ప‌దాల‌తో ఒకే ఒక లైన్ లో చేసిన ఆ ట్వీట్ లో బండ్ల గణేశ్ ఏమన్నారంటే.. ‘నా బాస్ ని నేను గౌరవిస్తా’ అంటూ ‘నమస్కారం’ చేసే ఎమోజీని పోస్ట్ చేశారు. దీంతో, పాటు పవన్ కల్యాణ్ ఫొటోనూ జతపరిచారు. కాగా, బండ్ల గణేశ్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే విషయమై నెటిజన్లు ఆలోచనలో పడ్డారు.