Monday, May 6, 2024
- Advertisement -

జగన్‌కు సన్నిహిత బంధువులే……. జగన్ రాజకీయ జీవితానికి శాపంగా మారుతున్నారా?

- Advertisement -

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా బలంగా ఉన్న జాతీయ స్థాయి పార్టీ ఒక్కటి కూడా లేదు. 2014ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భాజపా బలమంతా కూడా ఉత్తర భారతదేశంలో ఉందన్నది నిజం. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నా కూడా అధికారంలో ఉన్న తెదేపా, తెరాసలకు కూడా ఆయా రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లోనే పట్టు ఉంది అన్నది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైకాపా పరిస్థితి కూడా అదే. అలాంటి నేపథ్యంలో బలంగా ఉన్న చోట ఎంత ఎక్కువ స్థాయిలో స్థానాలు గెల్చుకున్నారన్నదాన్ని బట్టి అధికారంలోకి రావడమా? ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చోవడమా అన్న విషయం ఆధారపడి ఉంటుంది. 2014 ఎన్నికల్లో టిడిపికి, వైకాపాకు ఓట్లతేడా కేవలం ఐదు లక్షలు మాత్రమే. అయితే స్థాన బలం ఉన్న స్థానాల్లో పూర్తిగా గెలిచిన టిడిపికి అధికారం దక్కింది. స్థాన బలం ఉన్న చోట కూడా ఆధిక్యం నిలుపుకోలేకపోయిన వైకాపాకు ఓటమే మిగిలింది. అలా వైకాపాకు స్థాన బలం ఉండి కూడా నిలుపుకోలేకపోయిన ఒక జిల్లా ప్రకాశం. ఈ జిల్లాలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌ల అభిమానులు అడుగడుగునా కనిపిస్తారు. వైఎస్‌లు ఎప్పుడు ఈ జిల్లాలో అడుగుపెట్టినా ప్రజల బ్రహ్మరథం పడతారు. ఈ జిల్లాలో వైకాపాకు నాయకుల కొదవ కూడా లేదు. మరీ ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలాంటి జగన్‌కి బంధువులు, సన్నిహితులు అయిన బలమైన నాయకులు ఉన్నారు.

అయితేనేం అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు జగన్‌కి బంధువులు కూడా అయిన ఈ ఇద్దరు నాయకుల మధ్య ఎప్పుడూ గొడవలే. ఉపఎన్నికల్లో ప్రత్యర్థికి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తూ ఘన విజయం సాధించిన బాలినేని శ్రీనివాసరెడ్డి…..ఆ విజయ గర్వం చూపించి 2014ఎన్నికల్లో ఓటర్ల చీత్కారం ఎదుర్కున్నాడు. వైఎస్ హయాంలో మంత్రిగా కూడా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇప్పటికీ కూడా సీనియర్ నేతగా బాధ్యతలు స్వీకరించడం రావడం లేదు. ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి కూడా అందరినీ కలుపుకుపోవడం, అందరితో కలిసి సాగడం లాంటి కార్యక్రమాలు అస్సలు పెట్టుకోవడం లేదు. 2019 ఎన్నికల్లో అధికార బలాన్ని కూడా ఉపయోగించనున్న టిడిపిని ఎదుర్కోవాలంటే ఇలాంటి అంతర్గత బలహనీలు అస్సలు ఉండకూడదు అని క్యాడర్ ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. జగన్‌కి సన్నిహితులు, బంధువులు అయిన ఈ ఇద్దరు బలమైన నేతలు కలిసికట్టుగా సాగితే మాత్రం ప్రకాశం జిల్లాను పూర్తిగా స్వీప్ చేయడం కూడా వైకాపాకు సాధ్యమే అని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ముందు ముందు ఈ ఇద్దరు నేతల పయనం ఎలా ఉంటుందన్న విషయాన్ని బట్టే ఆ స్థాయి విజయాలు ఆధారపడి ఉంటాయి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -