Tuesday, May 14, 2024
- Advertisement -

ర‌హానేకు మొండిచేయ్యి…రోహిత్‌నే  కొన‌సాగించేందుకు కోహ్లీ నిర్ణ‌యం..

- Advertisement -

తొలి టెస్టులో బంగారం లాంటి అవకాశాన్ని జారవిడిచిన కోహ్లీసేన సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే రెండో మ్యాచ్‌లో గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది. రెండో టెస్ట్‌లో గెలిస్తేనే సిరీస్ ఆశ‌లు స‌జీవంగా ఉంటాయి. లేక‌పోతే ఒక మ్యాచ్ మిగిలిండ‌గానే టెస్ట్ సిరీస్ స‌ఫారీ జ‌ట్టు గెలుచుకుంటుంది. అందుకే సెంచూరియ‌న్‌లో జ‌రిగే రెండో టెస్ట్‌లో అమీ తుమీ తేల్చుకొనేందుకు టీమిండియా సిద్ద‌మ‌వుతోంది.

స్వదేశంలో వరుస సిరీస్‌ విజయాలతో జైత్రయాత్ర సాగించిన భారత్‌ సఫారీ గడ్డపై రెండో మ్యాచ్‌లోనే తప్పక గెలవాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకుంది. కేప్‌టౌన్‌లో 208 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఛేదించలేక 72 పరుగుల తేడాతో ఓడి పరువు పోగొట్టుకుంది.

మొద‌టి టెస్ట్‌లో ధావ‌న్‌, రోహిత్‌లు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. దీంతో టీమిండియాపై అన్ని వ‌ర్గాల‌నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. స‌ఫారీ ఫాస్ట్ పిచ్‌ల‌పై అజింక ర‌హానేకు మంచి . ర‌హానేను కాద‌ని రోహిత్ శ‌ర్మ‌ను తీసుకోవ‌డంపై కోహ్లీమీద విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

రెండో టెస్ట్‌లో అజింకా ర‌హానేను తీసుకుంటార‌న్న వార్త‌లు వెలువ‌డ్డాయి. అయితే ర‌హానేకుమ‌రో సారి నిరాశ త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. రెండో మ్యాచ్‌ జరిగే సెంచూరియన్‌ పిచ్‌ అదనపు బౌన్స్‌, స్వింగ్‌కు అనుకూలిస్తుంది. అందుకే గురువారం కోహ్లీసేన నెట్స్‌లో కఠిన సాధన చేసింది.

అయితే ఈ సెషన్‌లో అజింక్య రహానె ఒక మూగ ప్రేక్షకుడిగా మాదిరిగా వారిద్దరి ఆటను వీక్షించాడు. బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అతడికి కొన్ని బంతులు విసిరాడు. శిఖర్‌ ధావన్‌కు కూడా అంతే. ఐతే వీరిద్దరూ అసలైన పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కోలేదు. దీనిని బట్టి రెండో మ్యాచ్‌లో వీరిద్దరూ ఆడే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనేదానిపై సందేహాలు నెలకొన్నాయి.

రోహిత్‌, కోహ్లీ సాధన చేసిన చోటుకు మరోవైపు నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా, కేఎల్‌ రాహుల్‌ నెట్స్‌లో బ్యాటింగ్‌ చేశారు. వారితో పాటు హార్దిక్‌ పాండ్య, వృద్ధిమాన్‌ సాహా బ్యాటింగ్‌ చేశారు. ఈ ప్రకారం ఓపెనర్లుగా మురళీ విజయ్‌, కేఎల్‌ రాహుల్‌, వన్‌డౌన్‌లో పుజారా, ఆ తర్వాత విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ వచ్చే అవకాశం ఉంది. వీరి తర్వాత సాహా, పాండ్య వచ్చేస్తారు.

బౌలింగ్‌ పరంగా జట్టులో పెద్ద మార్పులేవీ ఉండకపోవచ్చు. పిచ్‌ పూర్తిగా పేసర్లకే అనుకూలిస్తుంది కాబట్టి అశ్విన్‌ను పక్కన పెట్టొచ్చు. గురువారం ఉమేశ్‌ యాదవ్‌ నెట్స్‌లో చెమటలు కక్కేలా బ్యాటింగ్‌, బౌలింగ్‌ సాధన చేశాడు. ద‌క్షిణాఫ్రికా బౌలింగ్‌ను ఎలాఎదుర్కొటార‌నేది ఇప్పుడు అస‌క్తిగా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -