అజ్ఙాతవాసిగా ఉంటూ తన గురించి ప్రజల్లో ఎప్పుడూ చర్చ జరిగేలా చేసుకున్నంత కాలం కొంతమంది తటస్థులకు కూడా పవన్ గొప్పగానే కనిపించాడు. కానీ ఒక సారి ప్రజల్లోకి వచ్చాక మాత్రం ఈ పవనుడు పూర్తిగా గాలి మాటల వ్యక్తిగాను, అజ్ఙాతవాసిగానూ ముద్ర వేయించుకోవడానికి చాలా తక్కువ టైమే తీసుకున్నాడు. ఇప్పుడు తాజా తెలంగాణా టూర్ నేపథ్యంలో పవన్ మాటలు పరిశీలించిన వాళ్ళందరూ కూడా పవన్‌ని పొలిటికల్ బ్రోకర్ అంటున్నారు. పవన్ అభిమానులు కూడా ఆ మాటలను ఖండించలేని పరిస్థితిని కల్పించాడు పవన్. పవన్ మాట్లాడిన మాటలు పరిశీలించిన తర్వాత పవన్ పొలిటికల్ బ్రోకర్ ఎందుకు కాదో మీరూ చెప్పండి.
చంద్రబాబుతో, కెసీఆర్‌తో ప్యాకేజీలు మాట్లాడుకున్నాడు. వాళ్ళిద్దరినీ పొగడడం….ప్రతిపక్ష పార్టీలను బలహీనపర్చడమే లక్ష్యంగా పవన్ పొలిటికల్ బ్రోకరిజంకు పాల్పడుతున్నాడన్నది పవన్‌పై ఉన్న ప్రధాన విమర్శ. ఈ విమర్శకు పవన్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలపైన విమర్శలు చేయకూడదని. తన బ్రోకరిజాన్ని సమర్థించుకోవడానికి పవన్ సూపర్ డైలాగ్ కొట్టాడు కదా……. మరి ఆ వెంటనే పవన్‌కి ఇంకో ప్రశ్న ఎదురైంది? భారతదేశ ఓటర్లు మొత్తం కూడా దశాబ్ధాల తర్వాత పూర్తి మెజారిటీ ఇస్తూ ఎన్నుకున్న మోడీ ప్రభుత్వంపై పవన్ ఎందుకు విమర్శలు చేసినట్టు? అలాగే ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్ కూడా ప్రజల చేతే ఎన్నుకోబడ్డాడుగా? మరి జగన్‌ని విమర్శించడం కూడా కరెక్ట్ కాదుగా…..పవన్ లెక్కల ప్రకారం. ఈ ప్రశ్నలకు పవన్ దగ్గర సమాధానం ఉందా?
ఇక ఓటుకు నోటు వ్యవహారం గురించి పవన్ మాట్లాడుతున్న మాటలు చంద్రబాబుకు సంతోషం కలిగిస్తున్నాయోమో కానీ………‘రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థను మారుస్తా…..అవినీతిని పారదోలుతా’ లాంటి పవన్ హీరోయిజం డైలాగులను నమ్మి పవన్‌ని అభిమానించినవారికి మాత్రం ఆవేదన కలిగిస్తున్నాయి. తెలంగాణా ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఉద్ధ్యేశ్యంతో కోట్లాది రూపాయల అక్రమ, అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బేరాలు మొదలెట్టి……యాభై లక్షల క్యాష్, ఐదు కోట్ల బేరం, టిడిపి అగ్రస్థాయి నేత వీడియో సాక్ష్యం, టిడిపి అధినేత ‘బ్రీఫ్డ్ మీ’ ఆడియో సాక్ష్యం ఉన్న అవినీతి వ్యవహారాన్ని సమర్థించడానికి పవన్‌కి సిగ్గుగా లేదా? ఓటుకు నోటు వ్యవహారాన్ని సమర్థిస్తున్న పవన్‌కి అవినీతి వ్యవహారాల గురించి మాట్లాడే అర్హత ఉందా? ఉంటుందా?
పవన్ మూఢాభిమానుల విషయం తెలియదు కానీ పవన్‌పై ఆశలు పెట్టుకున్న తటస్థులకు అయితే మాత్రం పవన్ పొలిటికల్ బ్రోకర్ వ్యవహారాలు చాలా స్పష్టంగా అర్థమయ్యాయి. ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు అని మాటల్లో ఆవేధన వ్యక్తం చేసే పవన్……కెసీఆర్ సూపర్, చంద్రబాబు ఇంకా సూపర్ అని చిడతలు వాయించడంలో ఏమైనా అర్థం ఉందా? నాలుగేళ్ళుగా తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న వాళ్ళిద్దరూ సూపర్లు……..డూపర్లు……అయితే ఇంకా తెలుగు ప్రజలందరూ కూడా ఎందుకు కష్టాల్లో ఉన్నట్టు? వైఎస్ జగన్, కోదండరామ్, ముద్రగడ పద్మనాభం, కమ్యూనిస్టు నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు……ఇలా ఏ ఒక్కరైనా…. వాళ్ళ సమస్యలపై ధర్నా చేస్తామంటే, ప్రజాక్షేత్రంలో అడుగుపెడుతామంటే వెంటనే హౌస్ అరెస్ట్‌లు చేయిస్తున్న చంద్రబాబు, కెసీఆర్‌లు……పవన్‌కి మాత్రం ప్రత్యేక కాన్వాయ్‌లు, ఫ్లైట్ లాంటి సౌకర్యాలు కల్పిస్తూ ….పోలీసు వ్యవస్థ చేత హై సెక్యూరిటీ ఇప్పిస్తూ పవన్‌ని ఎందుకు స్పెషల్‌గా చూస్తున్నట్టు? కరీంనగర్‌లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్……తన హోటల్ శ్వేతాలో పవన్ కోసం ప్రత్యేకంగా బస ఎందుకు ఏర్పాటు చేసినట్టు?
పవన్ ప్రజల కోసం రాజకీయం చేస్తున్నాడా? లేక అధికార పార్టీల కోసం పొలిటికల్ బ్రోకరిజం చేస్తున్నాడా అన్న విషయం ఆలోచన ఉన్న ఎవరికైనా ఇట్టే అర్థమయిపోతుంది.
https://www.youtube.com/watch?v=7NbNmadAuRA
