పోలీస్ కేసు ఎదుర్కొంటున్నా వర్మలో మాత్రం మార్పు రావడంలేదు. ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే వర్మ, తాజా మరో వివాదానికి తెరతీశారు. శనివారం రాత్రి పవన్ కళ్యాణ్‌ను పోర్న్ మూవీతో పోల్చుతూ వరుసగా ట్వీట్లు చేశారు. అంతేగాక పవన్ ఇష్టమా? పోర్న్ ఇష్టమా అంటూ ట్విట్టర్లో ఏకంగా పోల్ నిర్వహించారు. ట్విట్టర్లో వర్మ సంధించిన ప్రశ్నకు రెస్పాన్స్ బాగానే వచ్చింది.
గత రాత్రి 11 గంటల సమయంలో పవన్ కల్యాణ్ కావాలా? ‘పోర్న్’ కావాలా? అన్న రాంగోపాల్ వర్మ ప్రశ్నకు వేలాది మంది సమాధానం ఇచ్చారు. ఈ మధ్యాహ్నం 11 గంటల సమయానికి 25,856 మంది పవన్, పోర్న్ ఓటింగ్ లో పాల్గొన్నారు. పవన్ కన్నా, పోర్న్ కావాలన్నవారే అధికంగా ఉండటం గమనార్హం. 52 శాతం ఓట్లు అశ్లీల చిత్రాలు కావాలని రాగా, పవన్ కావాలని 48 శాతం ఓట్లు వచ్చాయి. ఇక ఈ పోలింగ్ ముగియడానికి మరో 12 గంటల సమయం ఉంది. ఇంకెంతమంది ఓటు వేసి ఏ ఆప్షన్ ఎంచుకుంటారో మరి.
What do u like more?
— Ram Gopal Varma (@RGVzoomin) February 17, 2018
