జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. జై లవకుశ ఘన విజయం తర్వాత యంగ్ టైగర్ చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. దీనికోసం విదేశీ ట్రైనర్ పర్యవేక్షణలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటుండగా ఈ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం.
ఎన్టీఆర్ సరికొత్త లుక్‌కు అనుగుణంగా డిఫరెంట్ టైటిల్‌ను పరిశీలించారు. ‘ఆన్ సైలెంట్ మోడ్’ అని ఫిక్స్ చేశారని టాక్. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2019లో సంక్రాంతి పండుగకు ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
