గుండెపోటుతో సినీ నటి శ్రీదేవి మరణం అందరినీ కలచివేస్తోంది. దుబాయ్‌లో శనివారం అర్ధరాత్రి మృతి చెందడం యావత్ సినీ లోకాన్ని దిగ్ర్భాంతికి గురి చేసింది. ఆమె ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకాభిమానాన్ని పొందారు. అయితే ఆమె చివరి కోరిక తీర్చుకోకుండానే వెళ్లిపోయారు. ఆమె తన పెద్ద కూతురు జాన్విని హీరోయిన్గా సినీ పరిశ్రమకు పరిచయం చేద్దామని చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు.
శ్రీదేవి జాన్విని ఎంట్రీ ఇప్పిద్దామని ఎంతగానో పరితపించారు. జాన్విని ఐదారేళ్ల కిందట్నుంచే ఆమె హీరోయిన్ చేయడానికి శిక్షణ ఇస్తూ వచ్చారు. ఆమె హీరోయిన్గా చేయడానికి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఆ సినిమా కన్ఫార్మ్ కావడానికి చాలా టైమ్ పట్టింది. చాలా ప్రతిపాదనలు ముందు ఉన్నా తనకు తొలి హిట్ వచ్చిన మాదిరి కూతురుకి రావాలని ఆశించింది. అందుకే ఎన్నో కథలు వచ్చినా మంచి కథ కోసం వెతికారు. చివరికి మరాఠీ బ్లాక్ బస్టర్ ‘సైరాట్’ రీమేక్ ద్వారా జాన్వీని హీరోయిన్గా పరిచయం చేయడానికి అంగీకరించింది.
ఈ సినిమా కోసం జాన్వీని నటన, డ్రెస్సింగ్, లుక్స్ ఇలా ప్రతి విషయంలోనూ శ్రీదేవీ శిక్షణ ఇస్తూ వచ్చింది. దీనికన్నా ముందు కొన్ని నెలల కిందటే జాన్వి తొలి సినిమా ‘ధడక్’ షూటింగ్ ప్రారంభమైంది. ఆ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఇంకా నాలుగు, ఐదు నెలల్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ ఆలోపే శ్రీదేవి వెళ్లిపోవడం కలచివేస్తోంది.
థియేటర్ స్ర్కీన్‌పై తన కూతురిని చూసి మురిసిపోవాలని భావించిన శ్రీదేవి ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయింది. దుబాయిలో ఓ పెళ్లి కోసం శ్రీదేవి, ఆమె భర్త బోనీకపూర్, చిన్న కూతురు కూడా వెళ్లారు. కానీ జాన్వీని తీసుకెళ్లలేదు. ఆమె ‘ధడక్’ షూటింగ్‌లోనే పాల్గొంటుండడంతో ఆమెను వదిలేసి వెళ్లిపోయారు.
