- Advertisement -

విషాదంలోఉన్న వ‌ర్మ‌కు ఓదార్పుగా అక్కినేని నాగార్జున ట్వీట్‌…

- Advertisement -

దుబాయిలోని ఓ హోటల్‌లో ప్రమాదవ శాత్తు మృతి చెందిన సినీనటి శ్రీదేవిపై ఎన్నో అసత్య వార్తలు ప్రచారం అవుతోన్న విషయం తెలిసిందే. శ్రీదేవి అకాలమరణంపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తీవ్ర విచారంలో మునిగిపోయి చేస్తున్న ట్వీట్‌కు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. ఆయన పరోక్షంగా రామ్‌గోపాల్‌ వర్మను ఓదార్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ‘అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని’ అంటూ నాగార్జున ట్వీట్‌ చేశారు

ఈ సందర్భంలో కొంత సానుకూలత కోసం తన కొత్త సినిమా టైటిట్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, విడుదల తేదీని విడుదల చేస్తున్నానంటూ రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్ చేశారు. ఆ సినిమా హీరో నాగార్జున.. వర్మ ట్వీట్ పై స్పందిస్తూ… మీ ఉద్దేశం నాకు తెలుసు రామ్ గోపాల్ వర్మ అని పేర్కొన్నారు.

ఈ సమయంలో తాను ఓ పాటలోని ఓ లైనుని గుర్తు చేస్తున్నానని ‘అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని’ అని ట్వీట్‌ చేశారు. ఆ సినిమా పాట అక్కినేని నాగేశ్వరరావు నటించిన మురళీకృష్ణ సినిమాలోది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -