Tuesday, May 7, 2024
- Advertisement -

శ్రియ పెళ్లి ఫిక్స్‌…మార్చీలో ర‌ష్య‌న్ యువ‌కుడితో మూడుముళ్లు

- Advertisement -

ఇష్టం సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి తెలుగు పరిశ్రమలోనే కాక దక్షిణాదిలో అగ్రతారల్లో ఒకరిగా వెలుగొందుతూ.. దాదాపు దశాబ్దానికి పైగా వెండితెరను ఏలిన, ఇంకా ఏలుతున్న తార శ్రియ. గత కొంతకాలంగా శ్రియ పెళ్లికి సంబంధించిన వార్తలు గుప్పుమంటున్నా… ఎక్కడా శ్రియ కన్ఫమ్ చేయలేదు. అయితే తాజాగా శ్రియ పెళ్లికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ.. ముంబై బ్లాగ్ లో శ్రియను ఉటంకిస్తూ వార్త ప్రచురితమైంది.

రష్యన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అయిన ఆండ్రికోచివ్ ని శ్రియ వివాహమాడుతుందని సమాచారం. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో శ్రియ-ఆండ్రికోచివ్ పెళ్లి ఘనంగా జరగనుందని, మూడు రోజుల పాటు ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మార్చి 17,18,19 తేదీలల్లో ఉదయ్ పూర్ లో జరిగే వివాహ వేడుక కోసం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. తన పెళ్లి విషయానికి సంబంధించిన ప్రశ్నలపై ఎప్పుడూ దాటవేస్తూ వుండే శ్రియ.. హోలీ థీమ్ లో వివాహం, మెహందీ, సంగీత్ వేడుకలతో గ్రాండ్ గా పెళ్లిచేసుకోబోతోంది. ఇప్పటికే క్లోజ్ ఫ్రెండ్స్ కు తన పెళ్లికి సంబంధించిన ఆహ్వానాలు ఫోన్ లో చేరవేసింది శ్రియ. ఇక ఉదయ్ పూర్ లో జరిగే ఈ వివాహానికి టాలీవుడ్ నుంచి ఎవరెవరు వెళ్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -