- Advertisement -

ఆస్కార్ విజేత‌లు వీరే..

- Advertisement -

ప్ర‌పంచంలో సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన అత్యున్న‌త పుర‌స్కారాలు ఆస్కార్‌. ఈ అవార్డు పొందితే ప్ర‌పంచవ్యాప్తంగా పేరు ప్ర‌ఖ్యాతులు సాధిస్తారు. ఇప్ప‌టిదాక మ‌న‌దేశానికి ఏఆర్ ర‌హమాన్ మాత్ర‌మే రెండు ఆస్కార్ అవార్డులు తీసుకొచ్చారు. ఈ సారి ఏమైనా భార‌త్‌కు అవార్డులు వ‌స్తాయంటే ఒక్క‌టీ రాలేదు. లాస్ఏంజెల్స్‌లోని డాల్బీ థియేట‌ర్‌లో 90వ ఆస్కార్ అవార్డుల ప్ర‌దానం సోమ‌వారం (మార్చి 5) అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా అవార్డుల‌ను ప్ర‌క‌టించి ప్ర‌దానం చేశారు.

ఉత్త‌మ న‌టుడు: ఆస్కార్స్ 2018 ఉత్తమ నటుడి పురస్కారం గారీ ఓల్డ్‌మన్ సొంతం చేసుకున్నాడు. 2017లో విడుద‌లైన‌న బ్రిటీష్ వార్ ఫిల్మ్‘డార్కెస్ట్ అవర్‌’లో ఆయన అద్భుతమైన నటనకు ఆస్కార్ లభించింది.

ఉత్తమ నటి: త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిసోరీ లో అద్భుతంగా నటించిన ఫ్రాన్సెస్ మెక్‌ డోర్మండ్‌కు ఉత్తమ నటి అవార్డు లభించింది.

ఉత్తమ సినిమా : ది షేప్ ఆఫ్ వాటర్‌కు పురస్కారం లభించింది.
ఉత్తమ ద‌ర్శ‌కుడు: ది షేప్ ఆఫ్ వాటర్‌ సినిమా తీసిన ద‌ర్శ‌కుడు గిల్లెర్మో డెల్ టోరో కూడా ఆస్కార్ అవార్డు పొందారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -