Tuesday, May 7, 2024
- Advertisement -

‘సాహో’లో శ్ర‌ద్ధా క‌పూర్ లుక్ ఇదే!

- Advertisement -

భారీ బ‌డ్జెట్‌లో ప్రభాస్ హీరోగా ‘సాహో’ సినిమా తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఆషికీ-2 హీరోయిన్‌, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ న‌టిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగే ఇంకా కొన్ని నెల‌లుగా కొన‌సాగుతోంది. దీంతో ప్ర‌భాస్ అభిమానులు, ప్రేక్ష‌కులు నిరాశ‌లో ఉన్నారు. బాహుబ‌లి విడుద‌ల‌య్యి దాదాపు రెండేళ్ల‌వుతున్నా ఇంత‌వ‌ర‌కు ప్ర‌భాస్ మ‌ళ్లీ ఒక‌ సినిమాలో రాలేదు.

సినిమా షూటింగ్ ఆల‌స్యం నేప‌థ్యంలో ‘సాహో’ నెమ్మ‌దిగా సాగుతోంది. ఈ మ‌ధ్య‌లో హీరోయిన్ శ్రద్ధా లుక్ లీక‌య్యింది. ఇదిగో ఇప్పుడు ఆ లుక్ లీక్ అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాహో టీమ్ మొత్తం ప్రస్తుతం విదేశాల్లో బిజీగా ఉంది. రూ.30 కోట్లు ఖ‌ర్చుతో ఓ భారీ యాక్షన్ స‌న్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ గేట్స్ ఆ ఎపిసోడ్‌కు పనిచేస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో వ‌స్తున్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, నీట్ నితిన్ ముఖేశ్ వంటి న‌టులు న‌టిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటూ భార‌త‌దేశ భాష‌ల్లో విడుదల చేయాలన్నది ప్లాన్.

ఇందులో శ్రద్ధా లుక్ అద‌ర‌గొట్టేలా ఉంది. ఇప్పుడు లీకైనా ఫొటోతో చెప్పేసేయొచ్చు. షర్ట్, ట్రౌజర్‌లో నడుము మీది చేతులతో కాస్త సీరియస్‌గా చూస్తు ఉన్న ఫొటో ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌భాస్‌కు స‌రిజోడీ అని ఈ ఫొటో చూసి అంద‌రూ అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -