- Advertisement -
వైఫై ఆపేసిందనే చిన్న కారణంతో ఓ భర్త తన భార్యపై దాడి చేసి గాయపరిచిన ఘటన హైదరాబాదులోని ఖైరతాబాదులో చోటు చేసుకుంది. నగరంలో నివసిస్తున్నఉమర్ పాషా బుధవారం రాత్రి తన మొబైలులో పోర్న్ వీడియోలు చూస్తున్నాడు. అతని భార్య రేష్మ ఎంత చెప్పినా పాషా వీడియోలు చూస్తేనే ఉన్నాడు. దీంతో ఆమె వైఫ్ రూటర్ను ఆపేసింది. దీంతో ఆగ్రహం చెందిన ఉమర్ పాషా ఆమెపై దాడికి దిగాడు.కర్రతో చితక బాదాడు.
పిడిగుద్దులు గుద్దాడు. కిందపడిపోయిన ఆమెను ఇంటిలోంచి వెళ్లకొట్టాడు.తీవ్ర గాయాలతో ఇంటికి చేరిన రేష్మాను చూసి ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందారు.ఉమర్ పాషాపై ఆమె తల్లిదండ్రులు పంజగుట్ట పోలీసులుకు ఫిర్యాదు చేయగా అతనిపై కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది.మొత్తనికి పోర్న్ వీడియో ఎంత పని చేసింది.
