Thursday, May 9, 2024
- Advertisement -

‘తొలిప్రేమ’ దర్శకుడితో చేస్తానంటున్న అఖిల్‌

- Advertisement -

తొలి సినిమాతోనే ‘తొలిప్రేమ’ వెంకీ అట్లూరి మంచి ఫీల్‌గుడ్ సినిమాను తీసేశాడు. ఇప్పుడు రెండో సినిమా అక్కినేని అఖిల్‌తో చేసే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు ఆ ఏర్పాట్లు పూర్త‌యిన‌ట్టు తెలుస్తోంది. దీనిపై ఉగాది వ‌ర‌కు అధికారికంగా ప్రకటన వ‌చ్చే అవ‌కాశం ఉంది.

వెంకీ అట్లూరి తొలి సినిమా ‘తొలిప్రేమ’ను నిర్మించిన భోగవిల్లి ప్రసాద్‌నే ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. హలో సినిమా తరువాత అఖిల్‌తో చాలా ద‌ర్శ‌కుల‌ను ప్ర‌య‌త్నించాడు. సత్య పినిశెట్టి పేరు గట్టిగా వినిపించగా.. మొన్న కొరటాల శివ, చంద్రశేఖర్ యేలేటి త‌దిత‌రుల పేర్లు కూడా వినిపించాయి. అయితే అవేవి ఖ‌రారు కాలేదు. చివ‌రికి వెంకీ అట్లూరిని ఫైన‌ల్ చేశాడ‌ని స‌మాచారం.

వాస్తవానికి ‘తొలిప్రేమ’ కన్నా ముందే వెంకీ అట్లూరి ఓ కథను అఖిల్‌కు చెప్పి ఓకే చేయించుకున్నాడు. అప్పుడు అఖిల్ హ‌లో సినిమాతో బిజీగా ఉండ‌డంతో ఈలోపు వెంకీ తొలిప్రేమ పూర్తి చేశాడు. ‘తొలిప్రేమ’ సినిమా విడుద‌లై సూప‌ర్‌హిట్‌గా నిల‌వ‌డంతో ఇప్పుడు అఖిల్ వెంకీకి అవ‌కాశం ఇచ్చేశారు. అక్కినేని నాగచైతన్యతో దోచేయ్ సినిమా నిర్మించిన బోగవిల్లి ప్రసాద్ ఇప్పుడు అఖిల్‌తో ఈ సినిమాను నిర్మించ‌నున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -