హిట్టా.. ఫట్టా అని చూడకుండా సినిమాల మీద సినిమాలు చేస్తున్న నటుడు నారా రోహిత్. పెద్దల అండదండలు ఉండడంతో వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. కొన్ని సినిమాలు మాత్రమే విజయాల బాట పడుతున్నాయి. అందుకే ఈ సారి మంచిగా ఆలోచించి మల్టీస్టారర్లపై కన్నేశాడు. ఇప్పుడు మరో ప్రయోగాత్మక పాత్రలో కనిపించడానికి సిద్ధమవుతున్నాడు. రోహిత్ తన తర్వాతి సినిమాలో మూగవాడిగా కనిపించనున్నాడని సమాచారం.
నారా రోహిత్‌కు ఈ సినిమా 18వది అవుతుంది. శ్రీ వైష్ణవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నారాయణరావు అట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ రాజేశ్ కథా, మాటలు అందిస్తున్నారు. పీబీ మంజునాథ్ దర్శకత్వంతో రూపొందిస్తున్న ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అన్నీ ఒకే చేసి ఉగాది పండుగ రోజు (ఆదివారం మార్చి 18)న పూజా కార్యక్రమాలతో ప్రారంభించే అవకాశం ఉంది.
