Monday, May 20, 2024
- Advertisement -

డేట్స్ లేవు వ‌ర్మ‌గారు.. సినిమా చేయ‌లేన‌ని చెప్పిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

- Advertisement -

పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి సినిమాతో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోగా మారిన యువ నటుడు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం విజ‌య్ చేతిలో సినిమాతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఓ ట్రావెల్‌ డ్రామాతో పాటు, సావిత్రి జీవిత చ‌రిత్ర సినిమా ‘మహానటి’ సినిమాలో కూడా న‌టిస్తున్నాడు. వీటి తరువాత తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘నోటా’ షూటింగ్‌కు సిద్ధ‌మ‌వుతున్న విజ‌య్ ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడికి మాత్రం సినిమా చేయ‌లేన‌ని చెప్పేశాడు.

ఎందుకంటే వ‌రుస సినిమాల‌కు ఒప్పుకోవ‌డంతో డేట్స్ ఏవీ ఖాళీ లేవు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే 365 రోజులు బిజీగా ఉన్నట్టు చెప్పొచ్చు. ప్ర‌ముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ విజయ్ కోసం ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో విజ‌య్‌ను సంప్ర‌దించ‌గా డేట్స్ అడ్జెస్ట్ చేయ‌లేని ప‌రిస్థితి అని నొప్పించ‌కుండా చెప్పేశాడు. ఈ కార‌ణంగా ఆర్జీవీ సినిమాను విజయ్ వ‌దులుకున్న‌ట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఆర్జీవీ నాగార్జున హీరోగా ఆఫీసర్‌ సినిమాను రూపొందిస్తున్నారు. ఆ త‌ర్వాతి సినిమాను విజ‌య్‌తో అనుకోగా ఇలా అయిపోయింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -