నాగ్ ప‌క్క‌న హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన అమ‌ల

అమ‌ల అంటే నాగ‌ర్జున వైఫ్ అనుకుంటున్నారా! కాదండీ ఈమె మ‌రో హీరోయిన్‌.నాగ్ పక్క మ‌రో అమ‌ల హీరోయిన్‌గా న‌టించ‌నుంది.ఆమె ఎవ‌రో కాదు మలయాళ నటి అమలపాల్.నాని, నాగార్జున మల్టీస్టారర్ సినిమాలో కింగ్ సరసన నటించబోయే హీరోయిన్ అమల పాల్ అని తెలుస్తోంది.

వివాహం, విడాకుల అనంతరం ఈమెకు యంగ్ హీరోలు ఛాన్స్ లు ఇవ్వడం లేదు.దీంతో నాగ్ పక్క‌న హీరోయిన్‌గా ఓకే చెప్పింది.విశేషం ఏమిటంటే కొన్నేళ్ల కిందట నాగార్జున తనయుడి సరసన హీరోయిన్ గా నటించింది. నాగచైతన్య హీరోగా నటించిన ‘బెజవాడ’ సినిమాలో హీరోయిన్ అమలపాల్.