నందమూరి కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ తీస్తోన్న ‘ఎమ్మెల్యే’ (మంచి లక్షణాలున్న అబ్బాయి) ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. టీజీ విశ్వప్రసాద్ సమర్పణలో బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘పిల్లలకు ఆస్తులిస్తే అవి ఉంటేనే బతుకుతారు.. అదే చదువునిస్తే ఎలాగైనా బతుకుతారు’ అంటూ కాజల్ ఓ డైలాగ్ చెపుతోంది.
మా ఊరిలో నన్ను అందరూ మంచి లక్షణాలున్న అబ్బాయి అని పిలుస్తారు.. దాన్నే షార్ట్ ఫామ్‌లో ఎమ్మెల్యే’ అంటారు అని కల్యాణ్ రామ్ చెబుతోన్న డైలాగులు అదుర్స్ అనిపిస్తున్నాయి. ఆ తర్వాత ‘నేనింకా రాజకీయం చేయడం మొదలు పెట్టేలేదు.. మొదలు పెడితే మీరు చేయడానికి ఏమీ ఉండద’ని కల్యాణ్ రామ్ మరో డైలాగు చెపుతున్నాడు. ఈ చిత్ర ట్రైలర్‌ను మీరూ చూడండి.