Saturday, April 27, 2024
- Advertisement -

మ‌ళ్లీ థియేట‌ర్స్‌కు క‌ళ వ‌చ్చింది!

- Advertisement -

సంక్రాంతికి సినిమాలు ఆడ‌లేదు.. ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత‌ థియేట‌ర్ల బంద్ ఈ విధంగా మూడు నెల‌లు టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ కొంచెం ముభావం ఉండిపోయింది. ఇక వారం పాటు థియేట‌ర్ల బంద్‌తో సినీ ప‌రిశ్ర‌మ వెల‌వెల‌బోయింది. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు, పంపిణీదారులు త‌దిత‌రులు అంతా క‌లిసి థియేట‌ర్ల‌ను త్వ‌ర‌గానే ప్రారంభించారు.

అయితే గ‌త శుక్ర‌వారం ప్రారంభ‌మైన థియేట‌ర్ల‌కు వారం త‌ర్వాత ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల‌తో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడాయి. కొత్త సినిమాలు రావ‌డంతో ప్ర‌జ‌లు కూడా ఆస‌క్తిగా ఎదురుచూశారు. నిఖిల్ సిద్ధార్థ్ కిరాక్ పార్టీ, న‌య‌న‌తార క‌ర్త‌వ్యం, అజ‌య్ దేవ‌గ‌ణ్ రైడ్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు.

దీంతో థియేట‌ర్లు కొంచెం క‌ళ‌గా క‌నిపిస్తున్నాయి. పైగా విడుద‌లైన మూడు సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకోవ‌డంతో శ‌ని, ఆదివారాలు కూడా థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడే అవ‌కాశం ఉంది. చాన్నాళ్ల త‌ర్వాత‌.. పిల్ల‌ల ప‌రీక్ష‌లు కూడా అయిపోవ‌డంతో సినిమాలు చూడ‌డానికి ప్ర‌జ‌లు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో స‌మ్మ‌ర్‌కు మంచి బోణి అదిరిన‌ట్టు క‌నిపిస్తోంది.

ఇక వ‌చ్చే ఏప్రిల్‌, మేలో మాత్రం స్టార్ హీరోల సినిమాలు, పెద్ద పెద్ద హీరోల సినిమాలు ప‌ల‌క‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. ప్రేక్ష‌కుల‌కు గ్యాప్ లేకుండా శుక్ర‌వారాల‌ను బుక్ చేసుకొని త‌మ స‌త్తా చాట‌డానికి వ‌స్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -