Monday, May 6, 2024
- Advertisement -

మాట మీద నిలబడే నాయకుడు జగన్ ఒక్కడే….. చంద్రబాబుకు దిమ్మ తిరిగేలా చేసిన సర్వే రిపోర్ట్

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? నాలుగేళ్ళుగా జరిగిన రాజకీయం ఒక లెక్క. ఎన్నికల ఏడాదిలో మొదలైన రాజకీయం మరో లెక్క. నాలుగేళ్ళుగా నన్ను, నా ప్రభుత్వాన్ని పొడిగి ఇప్పుడు సడన్‌గా తిట్టటం వెనకాల పవన్ ఆంతర్యం ఏంటి? అని చంద్రబాబు అమాయకంగా ప్రశ్నిస్తున్నాడు కానీ………నాలుగేళ్ళుగా మోడీని, బిజెపి ప్రభుత్వాన్ని పొగిడి…….ప్యాకేజ్ ప్రకటించిన వెంటనే వెంకయ్యనాయుడికి, అరుణ్ జైట్లీకి సన్మానాలు చేశాడు చంద్రబాబు. మోడీకి తిరుపతి లడ్డూలు, శాలువాతో సత్కారం చేశాడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా అభినందన తీర్మానం చేశాడు. ప్యాకేజ్‌తో పోలవరం కూడా పూర్తవుతుందని బ్రహ్మాండంగా కబుర్లు చెప్పాడు చంద్రబాబు. అంతేకాకుండా ప్యాకేజ్‌కి ఒప్పుకుని హోదాని వదులుకుని ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతుకొయ్యొద్దు అని ఆవేధనాపూరితంగా చంద్రబాబును బ్రతిమాలినంత పనిచేసిన జగన్‌ని ఎద్దేవా చేశాడు చంద్రబాబు. ఎటకారం చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం అందరూ ఒకే పాట పాడుతున్నారు. చంద్రబాబు, లోకేష్‌ల అవినీతి గురించి నాలుగేళ్ళుగా జగన్ చెప్తున్న మాటలను ఇప్పుడు పవన్ చెప్తున్నాడు. ఇక ప్యాకేజ్ మోసాలు, కేంద్ర ప్రభుత్వ అన్యాయాల గురించి నాలుగేళ్ళుగా జగన్ చెప్తున్న మాటలనే ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నాడు. ఎన్డీఏ నుంచి టిడిపి మంత్రులను ఉపసంహరించమని మూడేళ్ళుగా జగన్ చెప్తూ ఉంటే చంద్రబాబు ఇప్పుడు మేలుకున్నాడు. అలాగే అవిశ్వాస తీర్మానం అని చెప్పి జగన్ నాటకాలు ఆడుతున్నాడు అని చెప్పిన చంద్రబాబు……ఇప్పుడు అదే అవిశ్వాసానికి జై అన్నాడు.

చంద్రబాబు, పవన్‌లు కూడా ఇప్పుడు పూర్తిగా జగన్ బాటలో నడుస్తున్నారు. చంద్రబాబు అయితే నాలుగేళ్ళ జగన్ పోరాటాన్ని మొత్తం హైజాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆ ప్రయత్నం ఎంత వరకూ సక్సెస్ అయింది? ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు పోరాటాన్ని నమ్ముతున్నారా? కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నా హీరోగా, ప్రత్యేక హోదా ఉద్యమకారుడిగా చంద్రబాబుని చూస్తున్నారా? జగన్‌కి మద్దతుగా నిలుస్తున్నారా?

ఇదే విషయంపై సొంతంగా సర్వే చేయించుకున్నాడు చంద్రబాబు. తన భజన మీడియా సంస్థ అధినేత ఆధ్వర్యంలోనే ఈ సర్వే జరిగింది. అయితే సర్వే ఫలితాలు మాత్రం చంద్రబాబును షాక్‌కి గురిచేశాయి. చంద్రబాబు అంత అబద్ధాల కోరు ఇంకెవ్వరూ లేరు అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల మాట. చంద్రబాబువి అన్నీ డ్రామాలేనని, చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేల్చిచెప్పారు. చంద్రబాబు ఏం చెప్పినా ఇకపై నమ్మలేమని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. జగన్ మాట మీద నిలబడతాడన్న నమ్మకం ఉందని ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే నాలుగేళ్ళుగా ప్రజా ప్రయోజనాలో కోసం పోరాడిన వ్యక్తిగా జగన్‌నే చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్‌ని కూడా ప్రజలు పూర్తిగా నమ్మడం లేదు. బిజెపి నుంచి చంద్రబాబు, చంద్రబాబు నుంచి పవన్ నాలుగేళ్ళుగా ప్రయోజనాలు పొంది ఇప్పుడు ఎన్నికల సంవత్సరంలో ప్లేట్ ఫిరాయించారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. విభజన సమయంలో జగన్ సోనియాతో కుమ్మక్కయ్యాడని చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తే నమ్మామని……కానీ ఇప్పుడు మాత్రం బిజెపితో జగన్ కుమ్మక్కయ్యాడని చెప్తే నమ్మే ప్రసక్తేలేదని…….చంద్రబాబు అబద్ధపు ప్రచారాలను నమ్మి మరోసారి మోసపోమని ఎక్కువ మంది ప్రజలు ఘంటాపథంగా చెప్పారు.

ఈ సర్వే ఫలితాల తర్వాతనే పూర్తిగా యాక్టివ్ అయ్యాడు చంద్రబాబు. తోక పత్రిక అధినేతతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరోసారి నమ్మించడం ఎలా అనేవిషయంపై చర్చోపచర్చలు చేస్తున్నాడు. 2019లో కూడా చంద్రబాబు, ఆయన భజన మీడియా వ్యూహాలు సక్సెస్ అవుతాయేమో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -