- Advertisement -

క్యాస్టింగ్ కౌచ్ః టాలీవుడ్ టాప్ డైరెక్టర్, యంగ్ హీరో ఆ హీరోయిన్ స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయారా?

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. దశాబ్ధాల క్రితమే వచ్చిన పాకుడురాళ్ళు నవలలో అప్పటి అగ్రశ్రేణి హీరోల వ్యవహారాలను పూర్తిగా బయటపెట్టాడు ఆ నవలా రచయిత. ఇక ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ దారుణాలు ఇంకా పెరిగాయన్నది నిజం. సమాజంలో విలువలు బలహీనమైపోతున్నట్టే సినిమా ఇండస్ట్రీలోనూ జరుగుతోంది. అక్కడ ఉన్నది కూడా ఈ సమాజం నుంచి వచ్చిన మనుషులే కదా. అయితే ఇప్పటి హీరోయిన్స్ మాత్రం ఒకప్పటి హీరోయిన్స్‌లా అమాయకులు కాదు.

ఎంత పెద్ద హీరో అయినా సరే మరీ భయపడిపోయే స్థాయిలో వాళ్ళు లేరు. సౌత్‌లో ఒక అగ్రశ్రేణి హీరో తనతో మిస్ బిహేవ్ చేస్తే చాచి పెట్టి కొట్టానని రీసెంట్‌గా రాధికా ఆప్టే చెప్పింది. ఇక ఇప్పుడు ఒక యంగ్ హీరోయిన్……తెలుగు సినిమా ఇండస్ట్రీ అగ్రశ్రేణి డైరెక్టర్‌ని…….ఒక ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరోని ట్రాప్‌లో పడేసిందని తెలుస్తోంది. సెన్సిబుల్ సినిమాలు తీసే ఆ డైరెక్టర్‌ని ఇప్పుడు ఆ హీరోయిన్ ట్రాప్ చేసిందట. తనను తరచుగా ఇబ్బందిపెడుతున్న ఆ డైరెక్టర్‌కి గుణపాఠం చెప్పడానికి రెడీ అయిందట. ఇక ఒక అగ్రశ్రేణి ఫ్యామిలీకి చెందిన హీరోని కూడా ఆ హీరోయిన్ అడ్డంగా బుక్ చేసిందని తెలుస్తోంది. సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉన్న ఆ ఫ్యామిలీకి చెందిన ఆ హీరో తనను ఇబ్బందిపెట్టడంతో ఆ యంగ్ హీరోయిన్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుందట. పది సినిమాల కంటే తక్కువ సినిమాల్లో యాక్ట్ చేసిన ఆ హీరోయిన్‌కి ఇప్పుడు తెలుగులో సినిమాలేవీ లేవు. ఇకపై వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. అందుకే తనను ఇబ్బందిపెట్టినవాళ్ళపై ప్రతీకారం ప్లాన్ చేసిందట. ఇప్పుడు ఆ హీరోయిన్ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతో తాము ఎక్కడ బుక్కవుతామో అని ఇండస్ట్రీ జనాలు టెన్స్ అవుతున్నారు. ఫిల్మ్ ఛాంబర్‌లోనే సినిమా పెద్దల సమక్షంలోనే పరిష్కారం ప్లాన్ చేద్దామని……..మీడియాతో పాటు పోలీస్ స్టేషన్‌కి కూడా వెళ్ళొద్దని ఆ హీరోయిన్‌ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -