20మంది కోసం కోట్లు ఖర్చుపెట్టాడు….. ఇప్పుడు 40మంది టిడిపి ఎమ్మెల్యేలు రెడీ

కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయంగా, అక్రమంగా ఫిరాయింపులు చేయించిన నాయకుడిగా ఎప్పటికీ చంద్రబాబు నిలిచిపోతాడు. కాంగ్రెస్ హయాంలో వైకాపాలోకి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినప్పటికీ జగన్ మాత్రం వాళ్ళ చేత రాజీనామాలు చేయించాకే పార్టీలో చేర్చుకున్నాడు. అయితే చంద్రబాబు మాత్రం పూర్తిగా విలువలకు తిలోదకాలు ఇచ్చాడు. అథమ స్థాయి ఫక్తు రాజకీయ నాయకుడిని అని నిరూపించుకున్నాడు. అధికారం కోసం అన్ని విలువలనూ కాలరాస్తానని చాటి చెప్పాడు. ధన బలం, అధికార బలం……ఇలా అన్ని రకాల అక్రమాలకు పాల్పడి కూడా వైకాపా నుంచి 22 మంది ఎమ్మెల్యేలను జంప్ చేయించేసరికి చంద్రబాబు సత్తా అయిపోయింది.

అయితే ఇప్పుడు జంపింగ్‌ల విషయంలో బాబుకు దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. దాదాపుగా 40 మంది టిడిపి ఎమ్మెల్యేలు చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నారు. గతంలో విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయం చెప్పాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జాతీయస్థాయి మీడియాతో ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. 40మంది టిడిపి ఎమ్మెల్యేలకు చంద్రబాబు తీరు అస్సలు నచ్చడం లేదని……చంద్రబాబు అవినీతి, అక్రమ వ్యవహారాలతో విసిగిపోయి ఉన్నారని చెప్పుకొచ్చాడు పవన్. వాళ్ళందరూ కూడా వివిధ సందర్భాల్లో తనను కలిశారని…….చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారని చెప్పాడు పవన్ కళ్యాణ్. మామూలుగా అయితే తన నీడను కూడా నమ్మడు చంద్రబాబు. ఎన్టీఆర్‌కి తాను వెన్నుపోటు పొడిచినట్టుగా తనకు కూడా ఎవరైనా వెన్నుపోటు పొడుస్తారేమో అన్న భయం బాబుది. అయితే ఇప్పుడు పవన్ ప్రకటన దెబ్బకు చంద్రబాబు, లోకేష్‌లలో షివరింగ్ మొదలవ్వడం ఖాయం. ఇంతకుముందు విజయసాయిరెడ్డి కూడా ఇవే విషయాలు చెప్పాడు. చాలా మంది టిడిపి ఎమ్మెల్యేలు వైకాపాలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ……..అయితే జగన్ మాత్రం రాజీనామా చేశాకే పార్టీలోకి రావాలన్న షరతులు పెడుతున్నాడని విజయసాయి చెప్పుకొచ్చాడు. అన్నింటికీ మించి అడ్డగోలుగా జంపింగ్‌లను ప్రోత్సహించే ఉద్ధేశ్యం జగన్‌కి లేదు అని చెప్పాడు. అయితే ఇప్పుడు పవన్ కూడా 40మంది టిడిపి ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని చెప్పడం బాబులో భయం పెంచే విషయమే. 2019తర్వాత టిడిపి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఇప్పటికే చాలా సర్వేలు తేల్చిచెప్పాయి. ఆ విషయం నిజమని ఈ నలభై మంది ఎమ్మెల్యేలు నమ్మితే మాత్రం టిడిపి పని ఎన్నికలకు ముందే అయిపోయినట్టే. మొత్తంగా అనైతిక జంపింగ్‌లను ప్రోత్సహించి చంద్రబాబు చాలా పెద్ద సెల్ఫ్ గోల్ వేసుకున్నాడన్నది రాజకీయ మేధావులు చెప్తున్న మాట. ముందు ముందు ఈ 40 మంది ఎవరు అనే విషయంపై టిడిపిలో ఉన్న ఎమ్మెల్యేలను చాలా మందిని నారా చంద్రబాబు, లోకేష్‌లు అనుమానించడం ఖాయం. అదే జరిగితే టిడిపిలో ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయనడంలో సందేహం లేదు.