Wednesday, May 8, 2024
- Advertisement -

చేతులెత్త‌మొక్కినా టీఆర్ఎస్ వినిపించుకోలేదు….వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి

- Advertisement -

అవిశ్వాసంపై లోక్‌సభలో అదే డ్రామా కొనసాగుతోంది. విపక్షాల ఆందోళనలతో సభలో వాయిదాలపర్వం కొనసాగింది. ఇవాళ కూడా సభ ఆర్డర్‌లో లేదంటూ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసును చదివి వినిపించి… స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. స‌భ‌ను స‌జావుగా సాగ‌కుండా అడ్డుత‌గులుతున్న టీఆర్ఎస్ ఎంపీల‌పై కామెంట్స్ చేశారు వైసీపీ ఎంపీ వైవి. సుబ్బారెడ్డి.

కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అడ్డంకులు కల్పించవద్దని, చర్చ జరిగేందుకు సహకరించాలని టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలకు చేతులు జోడించి వేడుకున్నామని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల జీవితాలకు సంబంధించిన సమస్య అని… చర్చ కోసం స్పీకర్ అనుమతించే సమయంలో ఆందోళనలు చేపట్టకుండా, ఐదు నిమిషాల పాటు సహకరించాలని వేడుకున్నామని… అయినా వారు తమ ఆవేదనను అర్థం చేసుకోవడం లేదని అన్నారు.

కావేరీ వివాదం 70 ఏళ్లుగా ఉందని… దానిపై తాము పోరాడుతున్నామని అన్నాడీఎంకే ఎంపీలు చెబుతున్నారని చెప్పారు. వారి సమస్యలపై వారు పోరాటం చేయడంలో తప్పు లేదని… వారి సమస్యలను వారు పోరాటం చేస్తుంటే మనం ఆపలేమని అన్నారు. కనీసం రేపైనా సభ సజావుగా సాగుతుందని ఆవిద్దామని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -