రామ్ చరణ్ తేజ్, సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న‘రంగస్థలం’ సినిమా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తాను ‘రంగమ్మత్త’ అనే పాత్రలో హాట్ యాంకర్ అనుసూయ నటిస్తున్న సంగతి తెలిసిందే. నటిస్తున్నానని ఇటీవల యాంకర్, నటి అనసూయ చెప్పి, ఈ సినిమాలోని తనకు సంబంధించిన లుక్‌ను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.
ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతున్నప్పుడు సుకుమార్ తో కలిసి దిగిన ఫొటోను ఆమె పోస్ట్ చేసి ‘గురువుగారికి రంగమ్మత్త గురోపదేశం’ అని పేర్కొంది. ఈ ఫొటోలో అనసూయ ఒక పుస్తకం చేతిలో పట్టుకుని కుర్చీలో కూర్చొని ఉంది. అక్కడికి వచ్చిన సుకుమార్‌తో మాట్లాడుతున్నట్లు ఉంది.
Guruvu gariki Rangammatta guropadesam.. 🤪🤩😍#Throwback #WhileShootInProgress#RangasthalamOn30thMarch #Rangammatta pic.twitter.com/YX489t2GO6
— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 24, 2018