ఐపీఎల్ నుంచి ర‌ణ్‌వీర్ అవుట్‌

2018 ఐపీఎల్‌ ప్రారంభ వేడుకల్లో రణ్‌వీర్‌ సింగ్ డాన్స్ పర్ఫామెన్స్ చూద్దాం అనుకున్న వారికి నిరాశే మిగిలింది.ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో పాల్గొన్న రణ్‌వీర్‌ భుజానికి గాయమవడంతో ప్రదర్శన ఇవ్వడం లేదని తెలిపారు. డాన్స్‌ చేయడం వల్ల ఓవర్‌ స్ట్రెయిన్‌ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు సూచించడంతో రణ్‌వీర్‌ ఈ వేడుకకు దూరమయ్యాడని వెల్లడించారు.

రణ్‌వీర్‌ కోసం భారీ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధపడింది ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌. గాయం కారణంగా రణ్‌వీర్‌ దూరమవడంతో హృతిక్‌ రోషన్‌ను ఐపీఎల్‌ నిర్వాహకులు సంప్రదించినట్లు సమాచారం.