Tuesday, May 14, 2024
- Advertisement -

రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశంపై స్పందించిన సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మినార‌య‌ణ ..

- Advertisement -

సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మినారాయ‌ణ గురించి తెలియ‌ని వారుండ‌రు. అప్ప‌ట్లో జ‌గ‌న్ అక్ర‌మాస్తుల‌కేసుల‌ను టేక‌ప్ చేయ‌డంతో దేశ వ్యాప్తంగా సంచ‌లం అయ్యింది. ఆయ‌న హ‌టాత్తుగా స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌న‌కోసం మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తుచేసుకున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా ల‌క్ష్మినార‌యాణ రాజ‌కీయాల్లో కి వ‌స్తున్నార‌నే వార్త‌లు హాట్‌గా మారాయి. ఈ వార్త‌ల‌పై మాజీ జేడీ స్పందించారు. తాను భవిష్యత్‌లో ఏం చేయబోతున్నాననే విషయంపై ఎక్కడా చెప్పలేదన్నారు. తన రాజీనామా ఆమోదం పొందాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. తన రాజీనామా ఆమోదం పొందడంలో ఆలస్యం జరుగుతోందని కానీ, ఉద్దేశపూర్వకంగా కాదని, వరుస సెలవుల వల్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తన రాజీనామాపై దృష్టి సారించలేక పోతున్నారని అన్నారు.

పవన్ కల్యాణ్ జనసేన పార్టీలోకి తనను స్వాగతిస్తానని చెప్పినట్లు తాను పేపర్లో చదివానని, అలాగే పవన్ జేఎఫ్‌సీ గురించి కూడా చదివానని జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఇంకా కొన్ని ఉన్నాయని, రాజీనామా ఆమోదం పొందాక ఎందుకు చేశానన్న విషయం చెబుతానని అన్నారు. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై దాట‌వేసిన ల‌క్ష్మీనారాయ‌ణ .. తన సిద్ధాంతాలు త్వరలోనే ప్రకటిస్తానని అప్పటివరకు ఓపిక పట్టాలని అన్నారు. ఆయ‌న ఏపార్టీలోకివెల్తారా అన్న‌ది అస‌క్తిక‌రంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -