- Advertisement -
వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందించబడిన చిత్రం ‘లోఫెర్’. దర్శకుడు వరుణ్ ని ఈ సినిమాలో మాస్ లుక్ లో చాలా బాగా చూపించారు.
ఈ సినిమాలో అమ్మ సెంటీమెంట్ మరియు వరుణ్ అమ్మ పై చూపించే ప్రేమ ఈ చిత్రానికి చాలా హైలైట్ అయ్యేలా చేసాయి. అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ్ వరుణ్ ని తెగ మెచ్చుకుంటున్నాడు.
వరుణ్ నటించిన ‘లోఫెర్’ సినిమా చూసిన వర్మ తరువాత తన ట్విట్టర్ లో ట్వీట్స్ చెయ్యడం మొదలుపెట్టారు. ఆ ట్వీట్స్ లో వరుణ్ కాబోయే మెగాస్టార్ అని పిలిచారు.
వరుణ్ తేజ్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. వరుణ్ నటన నాకు చాలా బాగా నచ్చింది . ఈ చిత్రంతో వరుణ్ మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకుంటారు అని వర్మ తన ట్వీట్టర్ ద్వారా తెలిపారు.
