Tuesday, April 30, 2024
- Advertisement -

ప్రయోగం చేయబోతున్న రవితేజ

- Advertisement -

మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘బెంగాల్ టైగర్’ చిత్రం మంచి హీట్ అయింది. ఇప్పుడు రవి తన తదుపరి సినిమా చేసే పనిలో పడ్డాడు. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరాం డైరెక్షన్ లో ‘ఎవడో ఒకడు’ సినిమాలో నటించబోతున్నాడు. 

దిల్ రాజ్ సినిమా తర్వాత చక్రి అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా ఓప్పుకున్నాడు. దోంతో పాటే రవితేజ సుధీర్ వర్మ దర్శకత్వంలో కూడా ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఐతే రవితేజ ఒకేసారి రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు. 

అయితే సుధీర్ వర్మ్ సినిమాలో రవితేజ గెటప్ కొత్తగా ఉంటుందట. ఆ గెటప్ తో రవితేజ ప్రయోగం చేయబోతున్నాడని సమాచారం. సుధీర్ వర్మ సినిమాలో రవి డబుల్ రోల్ చేయనున్నాడు, ఆ డబుల్ రోల్ లో ఒక పాత్ర 20 ఏళ్ళ కుర్రాడిదైతే, మరో పాత్ర 50 ఏళ్ళ వయసు గల పాత్రట. 

ఈ విధంగా రవితేజ ప్రయోగం చేస్తున్నాడు. ఇప్పటికే 20 ఏళ్ళ కుర్రాడి పాత్ర కోసం డైట్ చేస్తున్నాడట. రవితేజ మొదటిసారిగా ప్రయోగం చేయబోతున్న ఈ సినిమా ఎలా ఊంటుందో చూడాలి మరి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -