నటుడు అజిత్ క‌న్నుమూత‌

ప్రముఖ మలయాళం నటుడు కొల్లం అజిత్‌ కన్నుమూశారు. కడుపు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న కొల్లం అజిత్‌ గత కొన్నిరోజులుగా కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

ఆయన 500లకుపైగా సినిమాల్లో నటించారు.అజిత్‌ చాలా సినిమాల్లో విలన్‌ పాత్రల్లో నటించారు. 1983లో పరన్ను పరన్ను పరన్ను సినిమాతో ఆరంగేట్రం చేసిన అజిత్‌… చివరిసారిగా ఆయన 2012లో ఇవాన్‌ అర్ధనారి సినిమాలో కనిపించారు.