రాంచరణ్ హీరోగా తెరక్కెకిన తాజా చిత్రం రంగస్థలం సినిమా హిట్ టాక్‌తో దూసుకుపొతుంది.నాన్ బాహబలిగా రికార్డులు సృష్టించింది. ఇండస్ట్రీలోని ప్రముఖులంతా కూడా ఈ సినిమా చూసి టీమ్ ను అభినందించారు. ఇందులోని రాంచరణ్ నటనకు అందరి ప్రశంసలు అందుతున్నాయి.ఇప్పుడు రాంచరణ్ బాబాయ్ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమా చూసి చిత్ర యూనిట్‌ని అభినందించారు. రాజకీయ కార్యకలాపాలతో బిజీగా ఉండటం వలన నిన్నటి వరకూ పవన్ కల్యాణ్ ఈ సినిమా చూడటం కుదరలేదు. నిన్న రాత్రి తన సతీమణి అన్నాలేజ్నోత్సావతో సినిమా చూశారు పవన్.
హైదరాబాద్ ఐ మాక్స్ లో ఆయన ఈ చిత్రాన్ని వీక్షించారు. చరణ్ ,ఉపాసనతో పాటు ఈ సినిమా దర్శక నిర్మాతలు కూడా వాళ్లతో థియేటర్ కి వచ్చారు.ఈ సినిమా చూసిన పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ తొలిప్రేమ తరువాత మళ్లీ థియేటర్ కి వచ్చి చూసిన సినిమా ఇదే. నిర్మాతలు ఒక గొప్ప చిత్రాన్ని తీసినందుకు సంతోషంగా వుంది. సుకుమార్ మంచి కథను రాసుకుని దానికి అద్భుతంగా తెరక్కెకించారు అని , సినిమా వాస్తవానికి దగ్గరగా ఉందని ప్రశంసించారు.ఇక చరణ్ విషయానికి వస్తే పల్లెటురు అబ్బాయిగా చరణ్ నటన చాలా బాగుందని ,చరణ్ నటనలో పరిణితి కనిపించదని సినిమాలో చరణ్ అదరగొట్టేశాడు అని చెప్పుకొచ్చాడు పవన్. ఈ కార్యక్రమంలో డైరక్టర్ సుకుమార్ కూడా పొల్గొన్నాడు.
