Friday, May 10, 2024
- Advertisement -

ఏమీ చేయలేక….. చేతకాక…… చంద్రబాబు బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్

- Advertisement -

2014 ఎన్నికల్లో చంద్రబాబు కంటే ఎక్కువగా ప్రజాదరణ ఉన్న వైఎస్ జగన్ ఓడిపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ బాబు వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించలేకపోవడం, బాబు బ్యాచ్ అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టలేకపోవడం ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెప్తూ ఉంటారు. అయితే నాలుగేళ్ళలో పరిస్థితులు పూర్తిగా తిరగబడ్డాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరాటం విషయంలో మైలేజ్ కోసం టిడిపి, వైకాపా, జనసేన పార్టీలు హోరా హోరీగా తలపడుతున్నాయి. కనీసం పోటీలో కూడా లేని జనసేనను పక్కన పెడితే టిడిపి-వైకాపాలు మాత్రం యుద్ధమే చేస్తున్నాయి. హోదా విషయంలో ఎన్నో సార్లు మాట మార్చిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హోదా పాట అందుకున్నాడు. అది కూడా నాలుగేళ్ళుగా హోదా విషయంలో మరో మాట లేకుండా పోరాటం చేస్తున్న వైకాపాను సైడ్ చేసి టిడిపిని అగ్రస్థానంలో కూర్చోబెట్టాలనుకుంటున్నాడు. అందుకోసం మోడీతో జగన్ కుమ్మక్కయ్యాడని ప్రచారం చేయించడంతో పాటు టిడిపి ఎంపిల చేత వీధి నాటకాలతో స్వయంగా చంద్రబాబు కూడా ప్రచార డ్రామాలు ఆడుతున్నారు.

అయితే ఈ సారి మాత్రం చంద్రబాబు పూర్తిగా డీలాపడిపోయాడు. జగన్ వ్యూహాలదే పై చేయి అయింది. మోడీ ఇంటి ఎదుట ధర్నా అంటూ ఓ అట్టర్ ఫ్లాప్ షో చేసి జాతీయ స్థాయిలో బ్యాడ్ నేం తెచ్చుకున్న టిడిపి ఎంపిలను విధిలేక ఢిల్లీ వదిలి వచ్చేయమని స్వయంగా చంద్రబాబే చెప్పాల్సి వచ్చింది. మరోవైపు నిరాహార దీక్ష చేస్తున్న వైకాపా ఎంపిలకు మాత్రం దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. తాజాగా జేడీయు నేత శరద్ యాదవ్ కూడా నిరాహార దీక్ష చేస్తున్న వైకాపా ఎంపిల శిబిరాన్ని సందర్శించి ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. ఇప్పటికే కమ్యూనిస్టులు కూడా జగన్ పార్టీకి మధ్దతు తెలిపారు.

దీనికి తోడు జాతీయ మీడియా మొత్తం కూడా నిరాహారదీక్ష చేస్తున్న వైకాపా ఎంపిలకు ఎక్కడ మైలేజ్ వస్తుందో, ఎక్కడ ప్రజాదరణ పెరుగుతుందో అన్న ఉద్ధేశ్యంతోనే చంద్రబాబు సారథ్యంలో టిడిపి ఎంపిలు డ్రామాలు ఆడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో విధిలేక ఢిల్లీలో దుకాణం సర్దేశారు టిడిపి ఎంపిలు. ఇక నుంచీ రాష్ట్రంలో డ్రామాలు చాలానే ఆడొచ్చు కానీ అప్పట్లో చంద్రబాబే స్వయంగా చెప్పినట్టుగా రాష్ట్రం కోసం పోరాడేవాళ్ళు ఢిల్లీ స్థాయిలో ఏం చేశారు అన్నది ముఖ్యం. ఆ రకంగా చూస్తే మాత్రం అవిశ్వాస తీర్మానం, రాజీనామాలతో పాటు నిరాహార దీక్ష విషయంలో కూడా జగన్ సారథ్యంలో వైకాపా ఎంపిలు చిత్తశుద్ధితో పోరాటం చేశారు. చేస్తున్నారు. ప్రజల మనసులు గెల్చుకున్నారు. చంద్రబాబు సారథ్యంలోని టిడిపి ఎంపిలు మాత్రం పోరాటకం డ్రామాలతో పూర్తిగా అభాసుపాలయ్యారు. జాతీయ స్థాయి మీడియాలో తెలుగు వారి పరువు తీశారని ఢిల్లీ స్థాయి తెలుగు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -