Tuesday, May 14, 2024
- Advertisement -

జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో మ‌రో కీల‌క మ‌లుపు

- Advertisement -

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో అక్ర‌మాస్తుల కేసుల‌నుంచి జ‌గ‌న్‌కు భారీ ఊర‌ట ల‌భిస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో పలువురు ఐఏఎస్ అధికారులపై ఉన్న కేసులను కోర్టు కొట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా నిందుడిగా ఉన్న అప్ప‌టి మ‌రో ఐఎస్ అధికారి మురళీధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై జరుగుతున్న విచారణ ప్రక్రియను కోర్టు నిలిపేసింది.

ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలంటూ సిబిఐను కోర్టు ఆదేశించింది. అనంతపురం జిల్లా లేపాక్షి హబ్‌లో ఇందూ గ్రూప్‌కు భూ కేటాయింపుల్లో క్విడ్‌ ప్రోకో ఉందంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. అందులో భాగంగా మురళీధర్‌ రెడ్డిని నిందితుడిగా చేర్చింది.

అయితే సీబీఐ చర్యను సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన హైకోర్టు ఆయన విచారణను నిలిపివేసింది. మురళీధర్‌కు ఈ వ్యవహారంలో ఎక్కడ లాభం చేకూరిందో సీబీఐ నిరూపించడంలో విఫలమైందని…. దీంతో విచారణను ఆపేసింది హైకోర్టు. మురళీధర్‌ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

అక్రమాలు జరిగిందనో లేకపోతే అవినీతి జరిగిందనో సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోతోందని కొన్నిసార్లు సిబిఐపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయ్. మొత్తం మీద జగన్ కేసుల్లో ఒక్కో ఐఏఎస్ అధికారిపై నమోదైన కేసులను కోర్టు కొట్టేస్తోంది . మొత్తం మీద ఎన్నికలకు ముందు అన్నీ కేసుల నుండి జగన్ కు ఊరట ల‌భించే అవ‌కాశాలు బ‌లంగా కనిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -