అజ్ఞాతవాసి దెబ్బకు బయట ఎక్కడ కనిపించకుండ పొయ్యాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.పవన్ కల్యాణ్ హీరోగాత్రివిక్రమ్ డైరక్షన్‌లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా మీద పవన్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషనల్లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి.సినిమా హిట్ అవుతుందని ఇండస్ట్రీ వారు కూడా భావించారు.సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి.కాని సినిమా చూసిన పవన్ అభిమానులే త్రివిక్రమ్‌ను తిట్టడం మొదలు పెట్టారు.సినిమా అసలు బాలేదని ఈ సినిమా త్రివిక్రమ్ సినిమాలా లేదనే కామెంట్స్ వచ్చాయి.ఈ సినిమాలో పవన్ నటనపై చాలానే విమర్శలు కూడా వచ్చాయి.త్రివిక్రమ్ పెన్ పవర్ ఈ సినిమాకు పని చేయలేదని చాలా మంది అభిప్రాయపడ్డారు.ఈ సినిమా దెబ్బతో త్రివిక్రమ్ ఇండస్ట్రీ ఎక్కడ కనిపించ లేదు.
త్రివిక్రమ్ స్వయంగా కథ , మాటలు అందించిన ఛల్ మోహన్ రంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ హజరైనా త్రివిక్రమ్ మాత్రం రాలేదు. దీంతో పవన్‌కు త్రివిక్రమ్‌ను మధ్య మన్శస్పర్థలు వచ్చాయనే కామెంట్స్ వినిపించాయి.ఎందుకంటే నితిన్ సినిమాకు పవన్,త్రివిక్రమ్ ఇద్దరు కలిసి నిర్మించారు.ఇప్పడు త్రివిక్రమ్‌ను బయటకు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది. ఎందుకంటే … త్రివిక్రమ్-ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఈ సినిమాకు సంధిందించిన షూటింగ్ నగర శివార్లలో మొదలైంది.ఫైట్ సీన్‌తో షూటింగ్ మొదలు పెట్టారు త్రివిక్రమ్-ఎన్టీఆర్ . చాలా రోజులు తరువాత త్రివిక్రమ్ బయట కనిపించడంతో ఆయన అభిమానలు పండుగ చేసుకుంటున్నారు.