Saturday, May 18, 2024
- Advertisement -

త‌న ఫేవ‌రేట్ హీరో పేరు చెప్పిన విరాట్‌….

- Advertisement -

భారత మాజీ క్రికెటర్‌, రికార్డుల రారాజు సచిన్‌ తెందుల్కర్‌ను స్ఫూర్తిగా తీసుకునే ఎంతో మంది యువ క్రీడాకారులు క్రికెట్‌ను తమ కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. భారత పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ కూడా సచిన్‌కు వీరాభిమానే. తాజాగా ఇదే విషయాన్ని మరోసారి కోహ్లీ చెప్పాడు.

తాజాగా బెంగళూరులో ఓ ప్రోగ్రామ్‌కి హాజరైన కోహ్లీని అభిమానులు ఈ ప్రశ్న అడిగారు. సినిమా హీరోల పేరు చెప్పకుండా సచిన్‌ అని ఎంతో వినయంగా కోహ్లీ సమాధానం చెప్పడంతో ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. కాగా, తాను వారాంతంలో సరదాగా గడిపేందుకు తనకు అవకాశం దొరికితే ఇంట్లో ఉండి రిలాక్స్‌ అవుతానని, లేకపోతే తన ఫేవరేట్‌ కారులో సంగీతం వింటూ డ్రైవింగ్‌ చేస్తానని అన్నాడు.

ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కోహ్లీ నాయకత్వం వహిస్తున్నాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన బెంగళూరు తదుపరి మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -